https://oktelugu.com/

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేరేది ఈ పార్టీలోనే?

తెలంగాణలో రాజకీయ పార్టీలు సమీకరణలు మార్చుకుంటున్నాయి. రోజుకో కొత్త పార్టీ పుట్టుకొస్తుందని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఎస్పీ కూడా బలోపేతం కావాలని భావిస్తోంది. ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన ఐపీఎస్, గురుకుల పాఠశాలల కార్యదర్శి ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరతారని తెలుస్తోంది. దీంతో ఆ పార్టీ తెలంగాణలో తన ప్రభావం చూపించుకుంటుందని భావిస్తున్నారు. అందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్తు తెలుస్తోంది. రాజీనామా లేఖలో బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం పేరును ప్రస్తావించడం గమనార్హం. కానీ […]

Written By:
  • Srinivas
  • , Updated On : July 28, 2021 / 11:38 AM IST
    Follow us on

    తెలంగాణలో రాజకీయ పార్టీలు సమీకరణలు మార్చుకుంటున్నాయి. రోజుకో కొత్త పార్టీ పుట్టుకొస్తుందని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఎస్పీ కూడా బలోపేతం కావాలని భావిస్తోంది. ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన ఐపీఎస్, గురుకుల పాఠశాలల కార్యదర్శి ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరతారని తెలుస్తోంది. దీంతో ఆ పార్టీ తెలంగాణలో తన ప్రభావం చూపించుకుంటుందని భావిస్తున్నారు. అందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్తు తెలుస్తోంది.

    రాజీనామా లేఖలో బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం పేరును ప్రస్తావించడం గమనార్హం. కానీ బీఎస్పీలో చేరతారని ఎవరు ఊహించలేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ లో చేరతారనే ప్రచారం ఊపందుకుంది. దీనికి జాతీయ మీడియా సైతం ప్రాధాన్యం ఇస్తోంది. స్వేరో పేరిట రాష్ర్ట వ్యాప్తంగా ఆయనకున్న ఇమేజ్ దృష్ట్యా సామాజిక మాధ్యమాలు హోరెత్తిస్తున్నాయి.

    ఆగస్టు 8న నల్గొండ జిల్లాలోని ఎన్ జీ కళాశాల మైదానంలో ఐదు లక్షల మందితో భారీ బహిరంగసభ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించుకున్నారు. తెలంగాణలోని జిల్లాల్లో వరుస సమావేశాలు నిర్వహిస్తూ తన రాజకీయ పంథాపై విధివిధానాలు ఖరారు చేస్తున్నారు. దీంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ ప్రవేశంతో దళితుల్లో ఐకమత్యం చేసే దిశగా ప్రణాళికలు రచిస్తున్నారు.

    దళితులకు రాజ్యాధికారమే ఎజెండాగా ముందుకు కదులుతున్నారు. ఇన్నాళ్లు దళితులకు చేసిన సేవల నేపథ్యంలో అందరు తమ వెంట నడుస్తారని ప్రవీణ్ కుమార్ భావిస్తున్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సాధ్యం కాదనే నినాదంతో ఎన్నికల్లో అడుగుపెడుతున్నారు. రాజకీయ కార్యాచరణ ప్రారంభమైంది. ప్రవీణ్ కుమార్ ను తమ పార్టీలో చేర్చుకునేందుకు అన్నిపార్టీలు ప్రయత్నించాయి. కానీ ఆయన మాత్రం బీఎస్పీలో చేరేందుకు నిర్ణయించుకోవడంపై అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.