Hetero Pharma Group: ఆదాయపు పన్ను శాఖ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. హెటిరో సంస్థపై గత మూడు రోజులుగా సోదాలు నిర్వహిస్తూ లెక్కలు తేలుస్తున్నారు. ఇప్పటివరకు అక్రమార్గాల్లో ఎంత మేర సంపాదించారో తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఆరు స్టేట్లలోని 50 ప్రాంతాల్లో దాడులు జరిపినట్లు తెలుస్తోంది. ఇందులో నివ్వెరపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. లెక్కల్లో లేని నగదు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 550 కోట్ల మేర లెక్కల్లో లేని ఆదాయం ఉందని తెలిసినా రూ.142.87 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నారు.

ఇందులో 16 బ్యాంకు లాకర్లు ఉన్నట్లు కనుగొన్నారు. లెక్కకు దొరకని పలు పుస్తకాలు, నగదు, ఖాతాలు లభ్యం కావడంతో ఇంకా కొన్ని విషయాలు వెలుగులోకి రానున్నట్లు తెలుస్తోంది. దీంతో హెటిరో సంస్థ తన రహస్యాలు కొన్ని బయటపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలు పెన్ డ్రైవ్, డాక్యుమెంట్లు, పుస్తకాలు ఆధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం.
దీంతో సంస్థ ఎక్కడి నుంచి అక్రమ ఆదాయాలు సంపాదించారనే దానిపై విచారణ జరుపుతున్నారు. ఆదాయపు పన్ను ఎగవేస్తూ రూ.లక్షలు దోచుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సంస్థ బాగోతం మొత్తం వెలికితీసే పనిలో పడిపోయారు. కానీ సంస్థ పేరును మాత్రం ఎక్కడా ప్రకటించకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇదివరలో కూడా ఇలాగే దాడులు చేసినా సంస్థల పేర్లు మాత్రం గోప్యంగా ఉంచుతూ ఆదాయపు పన్ను శాఖ అధికారులు ప్రకటన చేయడం లేదు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి పన్నులు ఎగవేస్తూ పలు సంస్థలు దోడిడీకి పాల్పడుతున్నాయని తెలుస్తోంది. ఎప్పుడైనా ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేస్తే బాగోతాలు బయటపడుతున్నాయి. ఫలితంగా అప్పుడు తప్పించుకునే మార్గాలపై దృష్టి పెడుతున్నారు. ప్రభుత్వాన్ని మోసం చేసేందుకు నిర్ణయించుకుంటున్నట్లు సమాచారం.