కంచే చేను మేస్తే.. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయురాలే దారితప్పితే. ఇక దిక్కెవరు? విద్యార్థుల భవిష్యత్ ఏమిటి? నైతికతను కాదని ఆ టీచర్ ఏకంగా విద్యార్థితోనే శారీరక సంబంధం పెట్టుకుని పరువు తీసింది. సభ్య సమాజం తలవంచుకునేలా ప్రవర్తించింది. చివరికి దొరికిపోయింది. విద్యార్థులను భావిపౌరులుగా తీర్చిదిద్దే పవిత్రమైన వృత్తిలో ఉంటూ జుగుస్సాకరమన రీతిలో తనలోని రాక్షసత్వాన్ని ప్రదర్శించి అతడి జీవితాన్ని నాశనం చేసిన ఆమె విపరీత పోకడపై పలు విమర్శలు వస్తున్నాయి. పాఠశాల యాజమాన్యం ఆమెను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.

లోపెజ్ ముర్రె మియామి డేడి కౌంటిలోని హిమాలియా మిడిల్ స్కూల్ లో డ్రామా ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. 2017లో రూకీ టీచర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికైంది. బాస్కెట్ బాల్ ప్రాక్టీస్ చేసే ముర్రె విద్యార్థిని తనతోపాటు బయటకు తీసుకెళ్లేంది. ఆపై ఇద్దరు కారులో సంభోగంలో పాల్గొనేవారు. వీరిద్దరి మధ్య సందేశాల రాయబారం కూడా కొనసాగేది. దీంతో ఇటీవల అతడి సోదరి ఫోన్లో సందేశం చూసి తండ్రికి చెప్పగా విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు ఆమెను అరెస్టు చేయడంతో పాఠశాల యాజమాన్యం ఆమెను విధుల నుంచి తొలగించింది. ఉద్యోగుల్లో నైతిక పరివర్తన కనిపించడం లేదని తెలుస్తోంది. విద్యార్థితో సంభోగం జరపడం చర్చనీయాంశం అవుతోంది. భవిష్యత్ తరాలకు ఆదర్శంగా ఉండాల్సిన ఆమె చేష్టలను అందరు ఖండిస్తున్నారు. ఆమెను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
దీనిపై ఆమె కోర్టుకు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. కానీ ఆమె విచిత్ర ప్రవర్తనపై అందరిలో ఆగ్రహం కలుగుతోంది. టీచర్ గా మంచి మార్గం సూచివంచాల్సిన ఆమే అతడిని తప్పుదారి పట్టించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఆమెను కఠినంగా శిక్షించి భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా జగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నారు.