కరోనా వారియర్స్‌గా ఉన్నవారిలో వైద్యులు, పోలీసులతో పాటు జర్నలిస్టులు కూడా ఉన్నారు. కరోనాపై నిత్యం ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరచేస్తూ కరోనాకు బలైన వారు ఎందరో ఉన్నారు. ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రలో ఎంతో మంది జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి వార్తలు తీసుకొచ్చారు. ఈ ప్రయత్నంలో కొందరు మృత్యువాత పడ్డారు. ఇలా మరణించిన జర్నలిస్టులకు సంస్థలు ఎలాగూ సాయం చేయలేవు కనీసం ప్రభుత్వాలైనా సాయం చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు.
Also Read: రైతు కన్నెర్ర చేస్తే.. ప్రభుత్వాలకు ఏ గతిపడుతుంది?
తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ ఉదారత చాటుకున్నారు. కరోనాతో మరణించిన జర్నలిస్టులకు రూ.5 లక్షల పరిహారం అందిస్తున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా 38 మంది జర్నలిస్టులు కరోనా యుద్ధంలో మరణించారు. వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఇచ్చేందుకు నిర్ణయించినట్లు జర్నలిస్టు సంఘాల నేత కె.శ్రీనివాసరెడ్డి మీడియాకు తెలిపారు. దీంతో వారి కుటుంబాలకు న్యాయం చేశామని ఇంతకుముందు జర్నలిస్టుగా ఆ తరువాత ప్రభుత్వసలహాదారుడిగా మారిన దేవులపల్లి అమర్ పేర్కొన్నారు.
అయితే కరోనా వారియర్స్‌గా పేర్కొంటున్న జర్నలిస్టుకలు రూ.50 లక్షల బీమా ప్రకటించాలని జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా జర్నలిస్టులు ఇంకా ఎన్నో సమస్యల్లో చిక్కుకున్నారని వారిని కనీసం ఆదుకోవడంలో లేదని ఎప్పటి నుంచో విమర్శిస్తున్నారు. ఇక తెలంగాణలో కరోనా సోకి ప్రతీ జర్నలిస్టులకు రూ.25 వేల పరిహారం ఇస్తున్నారు. కానీ ఆంధ్రలో పట్టించుకోవడం లేదని ఇన్నాళ్లు ఆవేదన చెందుతున్నారు. అయితే ఇప్పుడు జగన్ ప్రకటనతో ఊరట దక్కింది.
Also Read: రైతుల మెడకు మీటర్లు.. జగన్ కు లాభమా? నష్టమా?
అయితే తెలంగాణలోనూ చాలా మంది జర్నలిస్టులు కరోనాతో మృతి చెందారు. వారి విషయంలో కేసీఆర్ ఇలానే స్పందించాలని జర్నలిస్టులు కోరుతున్నారు. సీఎం జగన్ లాగానే కేసీఆర్ కూడా చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలని సూచిస్తున్నారు.