ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి మరోసారి నోటీసులు పంపారు అధికారులు. కృష్ణానది ప్రవాహం పెరుగుతున్న దృష్ట్యా కరకట్టపై ఉన్న ఆయన నివాసంతో పాటు మరో 36 ఇళ్లకు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఇక్కడున్న వారంతా ఇళ్లను ఖాళీ చేయాలని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. గతంలోనూ కృష్ణానది ఉగ్రరూపం దాల్చడంతో చంద్రబాబు ఇంటికి నోటీసులు అంటించారు. ప్రస్తుతం కృష్ణానదిలో 6 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చే అవకాశం ఉన్నందున ఈ నోటీసులు పంపినట్లు స్థానిక అధికారులు తెలిపారు. కాగా ప్రకాశం బ్యారేజి వద్ద వరద ప్రవాహం పెరుగతోంది.