Homeజాతీయ వార్తలుPM Kisan Money Credit: రైతుల ఖాతాల్లోకి రూ.2 వేలు.. అయితే ఇది తప్పనిసరి..

PM Kisan Money Credit: రైతుల ఖాతాల్లోకి రూ.2 వేలు.. అయితే ఇది తప్పనిసరి..

PM Kisan Money Credit: ప్రధానమంత్రి రైతు సంక్షేమ పథకాలలో అత్యంత కీలకమైన Pm Kisan Scheme కింద రైతులకు అందించే వార్షిక ఆర్థిక సాయం తదుపరి విడతపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం 23వ విడతకు సంబంధించిన రూ. 2వేల సాయాన్ని ప్రధాని Narendra Modi జూన్ లేదా జులై నెలల్లో విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే ఖచ్చితమైన తేదీని కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ పథకానికి డబ్బులు పొందాలంటే మాత్రం ఇది తప్పనిసరి చేయించుకోవాలని అధికారులు తెలుపుతున్నారు. అదేంటంటే?

Pm Kisan Samman Nidhi పథకం కింద అర్హులైన రైతులకు సంవత్సరానికి మొత్తం రూ. 6వేల ఆర్థిక సాయం అందుతుంది. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా, ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ. 2వేల చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది చిన్న, సన్నకారు రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. అయితే 23వ విడత డబ్బులు పొందాలంటే రైతులు తప్పనిసరిగా e-KYC పూర్తి చేయాల్సి ఉంటుంది. e-kyc చేయని రైతుల ఖాతాల్లో సాయం నిలిచిపోయే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు హెచ్చరించింది. అందువల్ల రైతులు ముందుగానే ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

e-kyc పూర్తి చేయడానికి రైతులు Pm Kisanఅధికారిక పోర్టల్ ను సందర్శించాలి. అక్కడ e-KYC ఆప్షన్‌ను ఎంపిక చేసి ఆధార్ నంబర్ నమోదు చేయాలి. అనంతరం ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చే OTP నమోదు చేస్తే ప్రక్రియ పూర్తవుతుంది. ఇంటర్నెట్ సదుపాయం లేని రైతులు సమీపంలోని CSC కేంద్రాల్లో కూడా e-KYC చేయించుకోవచ్చు.అలాగే రైతులు తమ పేరు, ఆధార్ వివరాలు, బ్యాంక్ ఖాతా సమాచారం సరైనదిగా ఉందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. చిన్న పొరపాట్ల వల్ల కూడా విడత సాయం నిలిచిపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉండటం అవసరం.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...

Team India : గంభీర్ లేడు.. టీమిండియా నెంబర్ వన్..

Team India : ఇన్నాళ్లపాటు టీం ఇండియాకు దరిద్రం ఏందో.. శని ఏందో ఇప్పుడు అర్థమైంది. జట్టుకు ఏలినాటి శని లాగా దాపురించిన గంభీర్ లేకపోవడంతో.. ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి....

Vaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi :  49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్...

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...
Oktelugu Epaper
Exit mobile version