Roopa vs Rohini Sindhuri: వీధి నల్లాల కాడ పంచాయతీలు ఎలా ఉంటాయి… చూసేవాళ్ళకు వినోదం.. పంచాయతీలు పెట్టుకునే వాళ్లకు ప్రతీకారం.. మొత్తంగా అదొక యాక్షన్ సినిమా మాదిరిగా ఉంటుంది. కాకపోతే నల్లాల దగ్గర ఆడవాళ్లు మాత్రమే పోట్లాడుకుంటారు. ఎందుకంటే, తమను కాదని వేరే మహిళ ముందుకు వెళితే లేదా అక్రమంగా పెత్తనం సాగిస్తే చూస్తూ ఊరుకోలేరు. చూస్తుండగానే బిందెను లాగి పడేస్తారు. తమ నోటికి పని చెప్పి దుమ్ము దుమారం లేపుతారు.
సహజంగానే ఆడవాళ్లకు దూకుడు తత్వం ఎక్కువగా ఉంటుంది. పైగా తమ ఆత్మ గౌరవానికి భంగం కలిగితే ఆడవాళ్లు ఏమాత్రం తట్టుకోలేరు. వీధి పంపు పంచాయతీ కావచ్చు.. అది రాష్ట్ర సెక్రటేరియట్ కావచ్చు.. ఏ మాత్రం తగ్గేది లేదు అన్నట్టుగా పోరాటాలు చేస్తుంటారు. ఈ కథనం ప్రారంభంలో నల్లకాడి పంచాయతీ గురించి చెప్పాం. కానీ సెక్రటేరియట్ స్థాయిలో పనిచేసే మహిళా ఉద్యోగుల గురించి చెప్పలేదు కదా.. అయితే చదవండి ఈ కథనం..
అది సరిగ్గా 2023 సంవత్సరం.. కర్ణాటక రాష్ట్రంలో ఐపీఎస్ గా రూప పనిచేస్తున్నారు. అదే రాష్ట్రంలో ఐఏఎస్ అధికారిగా రోహిణి సింధూరి విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో రోహిణి కి సంబంధించిన ప్రైవేట్ ఫోటోలను రూప సోషల్ మీడియాలో షేర్ చేశారు.. అంతేకాదు ఆమెకు ఏకంగా 19 ప్రశ్నలు స్పందించారు. రోహిణి ప్రైవేట్ ఫోటోలను విడుదల చేయడమే కాదు.. వాటికి ట్యాగ్ కూడా జత చేశారు.
రోహిణి సింధూరి కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారి. ఈమె 2009 కర్ణాటక కేడర్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అధికారి. రోహిణి సింధూరి స్వస్థలం తెలంగాణ. ఈమె గతంలో హసన్, మైసూరు జిల్లాలలో కలెక్టర్ గా పని చేశారు . విధి నిర్వహణలో మొదట్లో సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వివాదాలలో తరచూ కనిపించారు. హసన్ జిల్లాలో కలెక్టర్గా పనిచేస్తున్నప్పుడు నాటి మంత్రి రేవన్నతో తో సింధూరి గొడవకు దిగారు.
అప్పట్లో సిద్ధరామయ్య ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రి మంజు పట్టుబడిన నేపథ్యంలో.. సింధూరి బదిలీ అయ్యారు. అయితే ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆమె హైకోర్టుకు వెళ్లారు. అయితే కోర్టు ఆమె బదిలీపై స్టే విధించింది. రేవన్న మాత్రం వెనక్కి తగ్గకుండా ఆమెను బదిలీ చేయించగలిగారు. మైసూర్ కలెక్టర్గా వెళ్లిన సింధూరికి.. అక్కడి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శిల్ప నాగ్ తో వివాదం ఏర్పడింది. ఇది కాస్త పెద్దదిగా మారడంతో వారిద్దరిని ప్రభుత్వం బదిలీ చేసింది.
మైసూర్ కలెక్టర్ గా ఉన్నప్పుడు సింధూరి రోగులకు సరిపడా ఆక్సిజన్ అందించడం విఫలం కావడంతో.. కరోనా సమయంలో 24 మంది చనిపోయారని చామరాజనగర్ కలెక్టర్ ఆరోపించారు. అంతేకాదు కరోనా నిర్వహణ కోసం ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఆమె అడ్డగోలుగా ఖర్చు చేశారు. అంతేకాదు లంచాలు తీసుకొని మనీ అకౌంట్ రిలీజ్ చేశారని మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. మైసూర్ లో కె ఆర్ నగర్ ఎమ్మెల్యే మహేష్ తో సింధూరికి విభేదాలు వచ్చాయి. మహేష్ పై సింధూరి భూముల అక్రమాలకు సంబంధించి మాట్లాడిన ఆడియో అప్పట్లో సంచలనంగా మారింది. దీన్ని మనసులో పెట్టుకున్న మహేష్ ఆమెపై పరువు నష్టం దావా వేశారు. అంతేకాదు చేనేత బ్యాగుల టెండర్లలో 14 కోట్ల అవినీతికి పాల్పడ్డారని మహేష్ ఆరోపించారు.
ఇదంతా జరిగిన తర్వాత రోహిణి సింధూరికి సంబంధించిన కొన్ని ప్రైవేటు ఫోటోలను ఐపీఎస్ అధికారి రూప తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ” ఇలాంటి ఫోటోలు మీకు సాధారణంగానే అనిపించవచ్చు. కానీ మహేష్ ను కలవడానికి సింధూరి ఎందుకు వెళ్ళింది. డీకే రవితో సింధూరి ఎందుకు చాటింగ్ చేసింది. తన ఫోటోలను ముగ్గురు ఐఏఎస్ అధికారులకు సింధూరి ఎందుకు పంపించింది” ఇలా సోషల్ మీడియాలో రూప ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో సింధూరి కూడా అదే స్థాయిలో స్పందించింది. రూప పై సింధూరి పరువు నష్టం దావా వేసింది. ఆ తర్వాత ఈ కేసు అనేక రకాల మలుపులు తిరిగింది.
కర్ణాటక ప్రభుత్వం వీరిద్దరి వ్యవహారంతో విసిగి వేసారి పోయింది. వారిద్దరినీ బదిలీ చేసింది. ఒకప్పుడు కర్ణాటకలో సంచలన అధికారులుగా పేరుపొందిన వీరిద్దరూ ఇప్పుడు ఎటువంటి ప్రభావం చూపించని శాఖలలో పనిచేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే చిన్నపాటి ఈగోల వల్ల తమ కెరియర్ మొత్తాన్ని నాశనం చేసుకున్నారు. అయితే ఇప్పటికి రూపకు, సింధూరికి ఎక్కడ గొడవ మొదలైంది అనే విషయంపై ఇంతవరకు క్లారిటీ లేదు. ఇప్పుడు అర్థమైందా నల్ల బిందెల కాడ పంచాయతీ.. సెక్రటేరియట్లో జరిగే పంచాయతీ ఒకటేనని.. అది కూడా ఇద్దరు ఆడవాళ్లు తమ అహాలు దెబ్బతింటే ఏ స్థాయిలో పోట్లాడుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా.