Spirit Movie first look: ప్రభాస్(Rebel Star Prabhas) అభిమానులు మరో పది రోజుల్లో విడుదల అవ్వబోతున్న ‘రాజాసాబ్'(The Rajasaab Movie) మూవీ అప్డేట్స్ కంటే ఎక్కువగా , ‘స్పిరిట్'(Spirit Movie) మూవీ అప్డేట్స్ కోసమే ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు అంటే అతిశయోక్తి కాదేమో. సందీప్ వంగ దర్శకత్వం లో రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఎలాంటి హంగామా లేకుండా, చాలా ప్రశాంతంగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ప్రభాస్ కూడా రెగ్యులర్ గా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేశారట. ఇప్పుడు నెల రోజుల పాటు సాగే ఒక భారీ షెడ్యూల్ ని మెక్సికో లో ప్లాన్ చేయబుతున్నాడట. ప్రభాస్ ఈ చిత్రం కోసం 70 రోజులకు పైగా డేట్స్ ని కేటాయించాడు. సాధ్యమైనంత తొందరగా ఈ సినిమా షూటింగ్ ని వేగంగానే పూర్తి చేసేందుకు చూస్తున్నారట.
సినిమాకు పెద్దగా VFX వర్క్ , భారీ సెట్స్ వంటివి అవసరం లేదు కాబట్టి షూటింగ్ పూర్తి చేసే డేస్ టార్గెట్ ని చాలా తేలికగా అందుకోగలరని విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేయబోతున్నారు. ఈ ఫస్ట్ లుక్ లోనే సినిమా విడుదల తేదీని కూడా ప్రకటిస్తారట. సలార్ చిత్రం లాగానే ఈ సినిమా కూడా వచ్చే ఏడాది డిసెంబర్ నెలలో విడుదల కాబోతుందా?, లేదా 2027 వేసవి కానుకగా విడుదల కాబోతుందా అనేది తెలియాల్సి ఉంది. ఈ చిత్రం లో హీరోయిన్ గా ‘యానిమల్’ బ్యూటీ త్రిప్తి దిమిరి నటిస్తోంది. ముందుగా దీపికా పదుకొనే ని సంప్రదించారు. ఆమె పెట్టే కండీషన్స్ నచ్చక సందీప్ వంగ ఆమెని తప్పించి త్రిప్తి దిమిరి ని ఎంచుకున్నాడు. ఈ విషయం లో దీపికా, సందీప్ మధ్య పెద్ద గొడవ కూడా జరిగింది. అదేంటో మన అందరికీ తెలుసు.
ఇక ఈ సినిమాలో విలన్ గా వివేక్ ఒబెరాయ్ నటిస్తుండగా, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇదంతా పక్కన పెడితే , ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ గా, ఈ చిత్రం లో మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ క్యామియో రోల్ లో కనిపించబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో చాలా కాలం నుండి వినిపిస్తున్న మాట. అదే కనుక నిజమైతే ఈ సినిమా రేంజ్ ఎవ్వరూ ఊహించని స్థాయికి వెళ్ళిపోతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా చిరంజీవి చేతుల మీదగానే జరిగింది. రాబోయే రోజుల్లో కచ్చితంగా ఆడియన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయి రేంజ్ అప్డేట్ రాబోతుందని అనుకోవచ్చు.