Roja as Home Minister: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త క్యాబినేట్ నేడు కొలువు దీరనుంది. నేడు ఉదయం 11:3ంగంటల సమయంలో కొత్త మంత్రులందరితో గవర్నర్ బిశ్వభూషణ్ హరిప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కొత్త, పాత కలయికలో ఏర్పడిన జగన్ కొత్త క్యాబినేట్ పై అందరి దృష్టి నెలకొంది. పాత మంత్రులందరికీ వారీ శాఖలే దక్కుతాయని అంతా భావిస్తున్నారు. అదే సమయంలో కొత్త వారికి ఏయే శాఖ దక్కుతాయనే ఆసక్తి సైతం అందరిలోనూ నెలకొంది.
ముఖ్యంగా ఎమ్మెల్యే రోజాకు ఏ శాఖ కేటాయిస్తారని ఆమె అభిమానులతోపాటు ఏపీ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ సాయంత్రం లోగా మంత్రుల శాఖలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ముందుగానే రోజా అభిమానులు మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. రోజా ఏపీ హోంమంత్రిగా నియామకం అయ్యారంటూ వికీపీడియాలోనూ అప్టేడ్ రావడం వెనుక ఆమె అభిమానులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఏపీ క్యాబినెట్లో పోస్టు కోసం వైసీపీ నేతల నుంచి తీవ్ర పోటీ నెలకొంది. ఈక్రమంలోనే రోజాకు ఈసారి కూడా మంత్రి పదవీ దక్కకపోవచ్చనే ప్రచారం జరిగింది. అయితే వాటిన్నింటిని పటపంచాలు చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి రోజాను తన క్యాబినెట్లోకి తీసుకున్నారు. దీంతో రోజాకు హోంమంత్రి ఖాయమనే ప్రచారాన్ని ఆమె అభిమానుల పెద్దఎత్తున ఏపీలో చేస్తున్నారు.
అయితే రోజాను కేవలం ప్రభుత్వ వాయిస్ ను బలంగా విన్పించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు హోంమంత్రి పదవీ దక్కకపోవచ్చని తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు రోజాకు పౌర సరఫాల శాఖ లేదా పరిశ్రమల శాఖ ఇచ్చే అవకాశముంది. అయితే గతంలో మాదిరిగానే మహిళకే హోంమంత్రి దక్కే అవకాశం ఎక్కువగా ఉంది. ఎస్సీ కోటాలో తానేటి వనితకి ఈ సారి హోం మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
మరోవైపు తనకు హోమంత్రి కేటాయించారనే ప్రచారంపై ఎమ్మెల్యే రోజా సైతం స్పందించారు. జగన్ క్యాబినేట్లో ఉండటమే తనకు గొప్ప అదృష్టమని.. ఏ శాఖ ఇచ్చినా మంచి పనితీరు చూపిస్తానని తెలిపారు. పూర్తిగా ప్రజా సేవలోనే ఉంటానని.. ఇకపై సినిమాల్లో నటించబోనని రోజా స్పష్టం చేశారు. ఏదిఏమైనా ఈ సాయంత్రానికి కల్లా రోజాకు కేటాయించే శాఖపై పుల్ క్లారిటీ రానుంది.