https://oktelugu.com/

Bigg Boss Telugu OTT: ‘బిందు మాధవి – యాంకర్ శివ’ లకు కలిసిరాని ఆరో వారం !

Bigg Boss Telugu OTT: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ షోలో బిందు మాధవికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. దానికి తోడు ఈ మదనపల్లి బ్యూటీ పై ఓట్ల వర్షం కురుస్తోంది. ఆమె మాత్రమే అందరికీ ఎందుకు ఎక్కువ ఫేవరేట్ అవుతుంది అంటూ నెటిజన్లు కూడా షాక్ అయ్యారు. అయితే ఈ క్రమంలో… తాజాగా బిందు మాధవికి ఆరో వారం ఏ మాత్రం కలిసి రాలేదు. బిందుతో పాటు యాంకర్ శివకు కూడా ఆరో వారం కలిసి […]

Written By:
  • Shiva
  • , Updated On : April 11, 2022 / 11:53 AM IST
    Follow us on

    Bigg Boss Telugu OTT: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ షోలో బిందు మాధవికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. దానికి తోడు ఈ మదనపల్లి బ్యూటీ పై ఓట్ల వర్షం కురుస్తోంది. ఆమె మాత్రమే అందరికీ ఎందుకు ఎక్కువ ఫేవరేట్ అవుతుంది అంటూ నెటిజన్లు కూడా షాక్ అయ్యారు. అయితే ఈ క్రమంలో… తాజాగా బిందు మాధవికి ఆరో వారం ఏ మాత్రం కలిసి రాలేదు. బిందుతో పాటు యాంకర్ శివకు కూడా ఆరో వారం కలిసి రాలేదు.

    Bigg Boss Telugu OTT

    పైగా ఈ వారం వరెస్ట్ పెర్పామర్ గా బిందు మాధవి జైల్ కి కూడా వెళ్లింది. అయితే, తన బెస్ట్ ఫ్రెండ్ యాంకర్ శివనే తనను వరెస్ట్ అనడం బిందు మాధవి అస్సలు రిసీవ్ చేసుకోలేకపోయింది. శివ మాటకు ఒక్కసారిగా ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. పైగా బిందు వరెస్ట్ అంటూ ఆమె నుదిటిపై యాంకర్ శివ స్టాంప్ కూడా గుద్దాడు.

    ఇంతకీ ఏమి జరిగింది అంటే.. రోబో క్వాయిన్స్ టాస్క్ లో క్వాయిన్స్ ని కాపాడుకోవడంలో బిందుమాధవి పూర్తిగా ఫెయిల్ అయ్యింది. నిజానికి బిందు హమీదా, శివలతో కలిసి గేమ్ ఆడాలని ప్లాన్ చేసుకుంది. అందుకే, హమీదా దగ్గర ఈజీగా క్వాయిన్స్ పెట్టింది. ఇదే పాయింట్ పట్టుకుని హౌస్ లో మెజారిటీ ఓటింగ్ బిందుకి వేశారు . వరెస్ట్ పెర్ఫామర్ గా ఆమెను నిలబెట్టారు.

    Also Read: సితార పాప కూచిపూడి డ్యాన్స్ చూశారా.. మహేష్ ఫ్యాన్స్ కి పండగే..

    మొత్తానికి ఈ వారం బిందుమాధవి ఫ్లవర్ అయితే, హమీదా క్లవర్ గా టాస్క్ ఆడి గెలిచింది. పొరపాటు చేసి బిందు తన గేమ్ లో ఫెయిల్ అయి తన టాప్ ప్లేస్ ను పాడు చేసుకుంటే… మరోపక్క యాంకర్ శివ మాత్రం తన ప్రవర్తనతో ఇప్పటిదాకా వచ్చిన మంచి ఒపీనియన్ ను చెడగొట్టుకున్నాడు.

    ‘యాంకర్ శివ’ తోటి కొందరు కంటెస్టెంట్లుతో వ్యవహారంచే తీరు ఒక్కోసారి తీవ్ర అభ్యంతరకరంగా ఉంటుంది. ఉదాహరణకు.. నటరాజ్ మాస్టర్ ముందుకు వెళ్లి యాంకర్ శివ కావాలని లుంగీ పైకి ఎత్తి చూపించడం లాంటి సంఘటనల కారణంగా శివ పై ప్రేక్షకుల్లో సరైన అభిప్రాయం కలగడం లేదు. తన ఓట్లును కూడా శివ ఈ రకంగా కోల్పోతున్నాడు.

    Also Read: ‘నటరాజ్ మాస్టర్’ ఇంట్రెస్టింగ్ గా కాదు, ఇరిటేటింగ్ గా మారుతున్నాడు !

    Tags