https://oktelugu.com/

డ్రగ్ కేసులో స్టార్ల పేర్లను బయటపెట్టిన రియా చక్రవర్తి?

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు అనేక మలుపు తిరుగుతోంది. బాలీవుడ్లోని నెపోటిజం కారణంగానే సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని తొలుత పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అయితే సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని.. అతనిని ఎవరో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ సుశాంత్ సింగ్ తండ్రి, బంధువులు ఆరోపించారు. ఈనేపథ్యంలో సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసును పోలీసులు ఛాలెంజ్ తీసుకొని విచారిస్తున్నారు. ఈ కేసులో డ్రగ్ మాఫియాకు లింకులు బయటపడటంతో ప్రస్తుతం ఆ దిశగా పోలీసులు విచారణ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 7, 2020 / 07:40 PM IST
    Follow us on

    Riya chakravarthy

    బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు అనేక మలుపు తిరుగుతోంది. బాలీవుడ్లోని నెపోటిజం కారణంగానే సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని తొలుత పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అయితే సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని.. అతనిని ఎవరో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ సుశాంత్ సింగ్ తండ్రి, బంధువులు ఆరోపించారు. ఈనేపథ్యంలో సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసును పోలీసులు ఛాలెంజ్ తీసుకొని విచారిస్తున్నారు.

    ఈ కేసులో డ్రగ్ మాఫియాకు లింకులు బయటపడటంతో ప్రస్తుతం ఆ దిశగా పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ కేసుపై సీబీఐ, ఈడీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) దర్యాప్తు కొనసాగిస్తుండటంతో రోజుకో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. తీగలాగితే డొంక కదిలిసినట్లు బాలీవుడ్లోని చీకటి కోణాలు ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయి.

    డ్రగ్ కేసుతో సంబంధం ఉన్న రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తి, శామ్యూల్ మిరండా, దీపేష్ సావంత్ అను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసి విచారించారు. రియా చక్రవర్తి ఆదేశాలతోనే తాను సుశాంత్ సింగ్ కు డ్రగ్ ఇచ్చినట్లు షోవిక్ పోలీసులతో తెలిపినట్లు సమాచారం. దీంతో గత రెండ్రోజులుగా పోలీసులు రియా చక్రవర్తిని అదుపులోకి విచారిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె పలు సంచలన విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది.

    సుశాంత్ సింగ్ కోసమే తాను తన సోదరుడి నుంచి డ్రగ్స్ తీసుకున్నట్టు రియా చక్రవర్తి ఎన్‌సీబీ విచారణలో అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే తాను ఎఫ్పుడూ కూడా డ్రగ్ తీసుకోలేదని స్పష్టం చేసినట్లు సమాచారం. అదేవిధంగా డ్రగ్ వ్యాపారి బాసిత్ తనను ఐదు సందర్భాల్లో కలిసాడని.. అతడే తమ ఇంటికి వచ్చేవాడని తెలిపింది. డ్రగ్స్ తో సంబంధం ఉన్న పలువురి బాలీవుడ్ స్టార్ల పేర్లను రియా చక్రవర్తి వెల్లడించినట్లు సమాచారం.

    సుమారు 18నుంచి 19మంది పేర్లను రియాచక్రవర్తి వెల్లడించిందని తెలియడంతో బాలీవుడ్లో ప్రకంపనలు మొదలైయ్యారు. ఇక 2016లో సుశాంత్ డ్రగ్స్ గాలానికి చిక్కినట్లు రియా చెప్పడం సంచలనంగా మారింది. ఈ కేసులో పలువురి స్టార్ల పేర్లు తెరపైకి రానుండటంతో మున్ముందు ఈ కేసు ఎలా సాగుతుందనేది ఆసక్తికరంగా మారింది.