కరోనా మహామ్మారిని దేశం నుండి పారద్రోలడానికి కేంద్రం తన వంతు చర్యలను ముమ్మురం చేసింది. ఈ వైరస్ నివారణ కోసం దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 21 రోజుల పాటు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే కరోనాపై పోరాటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు తమవంతు సాయం చేయడంలో నిమగ్నమయ్యాయి. మరోవైపు ప్రధాని పిలుపు మేరకు ఇప్పటికే దేశ ప్రజలు చప్పట్లతో మొదటిసారి సంఘీభావం తెలిపారు. నిన్న ఆదివారం రాత్రి 9 గంటల 9 నిమిషాలకు దేశ ప్రజలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దీపాలు వెలిగించి కరోనా పై పోరులో దేశ ప్రజలంతా ఒక్కటే అని నిరూపించారు. పేదా, గొప్ప తేడా లేకుండా అందరు దీపాలు వెలిగించి దేశం విపత్కర పరిస్థితుల్లో మేమంతా ఒకటే అని పిలుపునిచ్చాయి.
అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ రాజకీయ నాయకులు, పలు సినీ, వాణిజ్య, క్రీడా ప్రముఖులు కూడా దీపాలు వెలిగించి తమ ఐక్యతను చాటారు. ఇక ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. మాత్రం వెరైటీగా స్పందించారు. ఐతే.. ఊరందరి ఓ దారైతే.. తన రూటే సపరేటు అనేలా రామ్ గోపాల్ వర్మ ప్రవర్తించాడు. అందరూ ఇంట్లో దీపాలు వెలిగిస్తూ.. క్యాండిల్స్ వెలిగిస్తూ. టార్చిలైట్స్ ద్వారా తమ సంఘీభావం ప్రకటించారు. ఆ ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు. అయితే రామ్ గోపాల్ వర్మ మాత్రం లైటర్ ద్వారా సిగరెట్ ను వెలిగించుకున్న వీడియోను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.
దీంతో అటు మోడీ అభిమానులు, ఇటు వర్మ అభిమానులు అవాక్ అయ్యారు.
