
దాతలు ముందుకొచ్చి మాస్కులు, రక్షణ కిట్లు అందించాలి అని డాక్టర్లు లేఖలు రాసే పరిస్థితి రాష్ట్రంలో రావడానికి వైసిపి నాయకులు కారణమని టిడిపి అధికార ప్రతినిధి బుద్ధ వెంకన్న పేర్కొన్నారు. డాక్టర్లకు ఇవ్వాల్సిన మాస్కులు, రక్షణ కిట్లు వైకాపా నాయకులు కొట్టేస్తున్నారు అని పేపర్ లో చదివి ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి నెలకొందని ట్వీట్ చేశారు. ఏ 2 బుద్దులు ఎక్కడికి పోతాయి ఆ పార్టీ నాయకులు ఆఖరికి మాస్కులు, గ్లౌజులు కొట్టేసే స్థితికి దిగజారిపోయారని ఎద్దేవాచేశారు. కరోనా నియంత్రణకు ముందుండి పోరాడుతున్న డాక్టర్లకు, ఆసుపత్రి సిబ్బందికి మాస్కులు, వ్యక్తిగత రక్షణ కిట్లు లేకపోవడం దారుణమని తెలిపారు.
కరోనా అంత పెద్ద విషయం కాదు, పేరాసిట్మాల్ టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది, బ్లీచింగ్ వేస్తే వైరస్ చచ్చిపోతుందని అని ముఖ్యమంత్రి జగన్ చెబుతుంటే ఏ2, ఇతర వైసీపీ నాయకులు మాత్రం ఇన్ని జాగ్రత్తలు ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. దీనర్థం ప్రజలు ప్రాణాలు ఎలా పోయినా పర్వాలేదు మీరు మాత్రం బాగుంటే చాలు అనుకుంటున్నారని తెలిపారు.