వాలంటీర్ దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి

రాష్ట్రంలో వాలంటీర్ల దాడులు అడ్డు ఆపు లేకుండా ఉంది. రెండు రోజుల కిందట గుంటూరు నగరంలోని ఒక వ్యక్తిపై స్థానిక వాలంటీర్ దాడి చేసిన సంఘటన మరువక ముందే చిత్తూరు జిల్లాలో ఒక వ్యక్తిపై వాలంటీర్ కత్తితో దాడి చేసిన తీవ్రంగా గాయపరిచిన సంఘటన చేసుకుంది. కోవిడ్-19 బాధితుల కోసం ప్రభుత్వం అందజేస్తున్న ప్రత్యేక సాయం రూ. వెయ్యి పంపిణీలో జరుగుతున్న అసమానతలకు పాల్పడుతున్న వాలంటీర్‌ను ఓ వ్యక్తి ప్రశ్నించాడు. దీంతో నన్నే ప్రశ్నిస్తావా? అంటూ తీవ్ర […]

Written By: Neelambaram, Updated On : April 6, 2020 4:10 pm
Follow us on


రాష్ట్రంలో వాలంటీర్ల దాడులు అడ్డు ఆపు లేకుండా ఉంది. రెండు రోజుల కిందట గుంటూరు నగరంలోని ఒక వ్యక్తిపై స్థానిక వాలంటీర్ దాడి చేసిన సంఘటన మరువక ముందే చిత్తూరు జిల్లాలో ఒక వ్యక్తిపై వాలంటీర్ కత్తితో దాడి చేసిన తీవ్రంగా గాయపరిచిన సంఘటన చేసుకుంది.

కోవిడ్-19 బాధితుల కోసం ప్రభుత్వం అందజేస్తున్న ప్రత్యేక సాయం రూ. వెయ్యి పంపిణీలో జరుగుతున్న అసమానతలకు పాల్పడుతున్న వాలంటీర్‌ను ఓ వ్యక్తి ప్రశ్నించాడు. దీంతో నన్నే ప్రశ్నిస్తావా? అంటూ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన వాలంటీర్ ఆ వ్యక్తిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. చిత్తూరు జిల్లాలోని కేవీ పల్లి మండలం బండ వడ్డిపల్లి వాలంటీర్ శ్రీనివాసులు రూ.1000 పంపిణీలో అసమానతలు పాటిస్తుండటం గమనించిన ఆ గ్రామానికి చెందిన విశ్వనాధ రాజు వాలంటీర్ ను ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో వాలంటీరు తీవ్ర ఆగ్రహంతో ఆ వ్యక్తిపై కత్తితో మెడను నరికి కడుపు పైన రెండు కత్తిపోట్లు పొడిచి తీవ్రంగా గాయపరచాడు. అప్రమత్తమైన కుటుంబీకులు, స్థానికులు ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు తెలుస్తోంది.