https://oktelugu.com/

RGV: ఏపీ నేతలు బాక్సింగ్, కరాటే నేర్చుకోవాలి.. తప్పదన్న రాంగోపాల్ వర్మ

RGV:ఏపీ రాజకీయ మంటల్లో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ చలికాచుకుంటున్నారు. దేశంలో, రాష్ట్రంలో ఏది జరిగినా దానిపై నిర్మోహమాటంగా స్పందించే వర్మ తాజాగా ఏపీ రాజకీయాల్లో టీడీపీ వర్సెస్ వైసీపీ ఫైట్ పై ఆసక్తికరంగా స్పందించారు. సెటైర్లు వేశారు. ఏపీ రాజకీయాలను తనదైన శైలిలో అభివర్ణించారు. వర్మ చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అయ్యాయి. తాజాగా ఏపీ రాష్ట్ర రాజకీయాలపై వర్మ వేసిన సెటైర్లు బాగా పేలాయి. ఏపీలో ఉండే రాజకీయ నాయకులు అందరూ బాక్సింగ్ నేర్చుకోవాలంటూ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 21, 2021 / 11:57 AM IST
    Follow us on

    RGV:ఏపీ రాజకీయ మంటల్లో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ చలికాచుకుంటున్నారు. దేశంలో, రాష్ట్రంలో ఏది జరిగినా దానిపై నిర్మోహమాటంగా స్పందించే వర్మ తాజాగా ఏపీ రాజకీయాల్లో టీడీపీ వర్సెస్ వైసీపీ ఫైట్ పై ఆసక్తికరంగా స్పందించారు. సెటైర్లు వేశారు. ఏపీ రాజకీయాలను తనదైన శైలిలో అభివర్ణించారు. వర్మ చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అయ్యాయి.

    ram gopal varma

    తాజాగా ఏపీ రాష్ట్ర రాజకీయాలపై వర్మ వేసిన సెటైర్లు బాగా పేలాయి. ఏపీలో ఉండే రాజకీయ నాయకులు అందరూ బాక్సింగ్ నేర్చుకోవాలంటూ కామెంట్ చేశారు. ఈ మేరకు వర్మ ట్విట్టర్ లో చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

    ‘ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితులు చూస్తుంటే అతి త్వరలో అక్కడ నాయకులు బాక్సింగ్, కరాటే, కర్రయుద్దం నేర్చుకోవాల్సి ఉంది’ అని వర్మ సెటైర్లు వేశారు. వర్మ ఏపీ రాజకీయ నేతలు ముష్టిఘాతాలు కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

    ఇటీవల టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి నోరుజారడం ఈ వివాదానికి కేంద్రబిందువైంది. సీఎం జగన్ పై ‘ఓరేయ్ బోసిడీకే’ అనడంతో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయి టీడీపీ నేతల ఇళ్లు, కార్యాలయాలను ధ్వంసం చేశారు. దీన్ని నిరసిస్తూ చంద్రబాబు 36 గంటల దీక్షకు దిగారు. వైసీపీ పోటీగా జనాగ్రహ దీక్షలకు దిగింది. దీంతో ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. ఆ మంటల్లో రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో సెటైర్లు వేశారు.