https://oktelugu.com/

Revanth Reddy: కేసీఆర్ టార్గెట్.. ధర్మయుద్ధం మొదలెట్టిన రేవంత్ రెడ్డి

Revanth Reddy: గజ్వెల్ ఆత్మ గౌరవ సభ నుంచి రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షులు నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. ‘‘తెలంగాణ వస్తే ఎంతో మంది బాగుపడుతారు అనుకున్నాం.. ఉద్యోగాలు ఇస్తరు అనుకున్నాం.. భూమి బాగు చేస్తాడనుకున్నాం కానీ.. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ లు కట్టి పేదల భూములు ముంచిండు.. వాళ్ళ బంధువుల భూములు కాపాడుకొని పేదల భూములు 60 వేల ఎకరాల భూమి మునిగింది.. కేసీఆర్ డగుల్బాజీ, దగాకోరు..’’ అని రేవంత్ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 18, 2021 / 09:17 AM IST
    Follow us on

    Revanth Reddy: గజ్వెల్ ఆత్మ గౌరవ సభ నుంచి రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షులు నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. ‘‘తెలంగాణ వస్తే ఎంతో మంది బాగుపడుతారు అనుకున్నాం.. ఉద్యోగాలు ఇస్తరు అనుకున్నాం.. భూమి బాగు చేస్తాడనుకున్నాం కానీ.. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ లు కట్టి పేదల భూములు ముంచిండు.. వాళ్ళ బంధువుల భూములు కాపాడుకొని పేదల భూములు 60 వేల ఎకరాల భూమి మునిగింది.. కేసీఆర్ డగుల్బాజీ, దగాకోరు..’’ అని రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

    లక్ష మంది కాంగ్రెస్ సైనికులతో గజ్వెల్ కు వస్తా అని చెప్పినా వచ్చానని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చాడు. కృష్జ్ఞ, గోదావరి నదులు ఒకసారి పారినట్టు ఉంది. జన సముద్రంతో గజ్వెల్ మునిగిపోయింది. ఆరు నెలల్లో మల్లీ వస్తా 5 లక్షల మంది తో కదం తొక్కుతామ్ అని పిలుపునిచ్చాడు.

    తెలంగాణ విముక్తి కోసం దొడ్డి కొమురయ్య, చాకలి అయిలమ్మ, షాయబుల్లాఖాన్, తురేబాజ్ ఖాన్ లు లాంటి ఏంతో మంది పోరాట ఫలితం నేటి తెలంగాణ స్వాతంత్రం అని రేవంత్ రెడ్డి అన్నారు.. తెలంగాణ అంటే ఎంతో మంది పాఠాలు చెప్పిన భూమి.. తెలంగాణ ఎంతో మంది నియంతలను తరిమికొట్టిందని అన్నారు.

    ఇందిరమ్మను మెదక్ ఎంపీ గా గెలిపించి ఢిల్లీకి ప్రధాన మంత్రిగా పంపిన ఘనత మెదక్ ప్రజలది అని రేవంత్ రెడ్డి కొనియాడారు. ఇందిరమ్మ ప్రధాని కావడం వల్ల ఇక్కడ 25 పెద్ద పరిశ్రమలు వచ్చాయన్నారు. దాని వల్ల ఎంతో అభివృద్ధి చెందాయి. లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి.. మాదిగల పక్షాన నేను అడుగుతున్న 12 శాతం ఉన్న వాళ్లకు ఒక్క మంత్రి పదవి ఇవ్వవా అని ప్రశ్నించారు. అర శాతం లేని కేసీఆర్ ఇంట్లో ఆరు పదవుల.. త్యాగాలు చేసింది ఎవరు.. పదవులు అనుభవిస్తున్నారు.. మీకు త్యాగం ఉంటే మీ పదవులలో ఒక్క పదవిని మాదిగలకు ఇవ్వు అని నిలదీశారు.

    కేసీఆర్ మనవడు తినే సన్న బియ్యం కూలి పిల్లలు తింటున్నారు అని కేసీఆర్ అంటున్నారు. మాకు కావాల్సినంది. సన్న బియ్యమో, చాప పిల్లల కోసం, గొర్రె పుల్ల కోసమో కాదు.
    కేసీఆర్ మనవడు చదువుతున్న స్కూల్లో మా పిల్లలు చదవాలి. మా పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, జడ్జిలు కావాలె.. కేసీఆర్ కు పంటి నొప్పి వస్తే యశోద ఆసుపత్రికి పోయి వైద్యం చేయించుకుంటాడు.. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పెట్టి కార్పొరేట్ వైద్యం పేదలకు అందిస్తే దాన్ని అమలు చేయడం లేదని రేవంత్ నిలదీశారు. .

    -రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే..
    కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని చెప్పి అడ్రస్ లేదు. దళిత, గిరిజనులకు లక్ష కోట్లు అప్పు పడ్డాడు. కేసీఆర్ ఇల్లు అర్రజ్ పెట్టి ఆ డబ్బులు వసూలు చేస్తాం.. రాష్ట్రంలో 34 వేల కోట్ల ఆదాయం మద్యం ద్వారా వస్తుంది. 12 ఏళ్ల పిల్లగాళ్ళు మద్యానికి బానిస అయ్యారు. కేసీఆర్ తాగుబోతులకు బ్రాండ్ అంబాసిడర్ అయితే.. డ్రగ్స్ కు డ్రామారావ్ బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. డ్రగ్స్ మాఫియా రాష్ట్రంలో విచ్చలవిడిగా తయారయింది. ఇంత ఘోరంగా రాష్ట్రంలో జరుగుతుంటే రాష్ట్రంలో డ్రగ్స్ సమాచారం ఇవ్వమంటే ఇవ్వలేమని సర్కార్ చెవుతుంది. అంటే దీని అర్ధం ఏంది.

    కేసీఆర్ రాష్ట్రంలో నీ మనువడు, పిల్లల లాగా అందరిని చూసి ఒకసారి ఆలోచించి పనిచేయ్యి.తెలంగాణ లో కేసీఆర్ కుటుంబ అరాచకాలు నుంచి తెలంగాణ ను కాపాడేందుకు తుది దశ ఉద్యమం చెయ్యాలి. ప్రతి పోలింగ్ బూత్ నుంచి 9 మంది కార్యకర్తలు 22 నెలలు ఇంటికి సెలవు పెట్టి పోరాటం చెయ్యాలి. సోనియమ్మ రాజ్యానికి మీరే బ్రాండ్ అంబాసిడర్ లు.. రాబోయే రోజుల్లో మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటాం.

    కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి రాజకీయంగా ఎంతో నష్టపోయిన.. తెలంగాన కోసం ఎంతో మంది ఉద్యమం చేస్తే ఇప్పుడు ఎవడి పాలైంది తెలంగాణ.. సింగరేణి కాలనీలో ముక్కుపచ్చలారని ఒక గిరిజన బాలికను అత్యంత పాశవికంగా రేప్ చేసి కాళ్ళు చేతులు విరిచి హత్య చేసి మూట కట్టి పెట్టిన ఒక దుర్మార్గుడిని 7 రోజుల వరకు కూడా పోలీసులు పట్టుకోలేదు. నేరేళ్ల లో ఇసుక మాఫియా తో బాధలు పడుతుంటే కేసీఆర్ ను అడిగినందుకు దళిత యువకులను థర్డ్ డిగ్రీ చేసి సంసారానికి పనికిరాకుండా చేశారు.

    ఖమ్మంలో మిర్చి పంట కొనుగోలు చేయాలని, మద్దతు ధరలు ఇవ్వాలని అడిగిన పాపానికి వాళ్ళను ఉగ్రవాదుల్లాగా అరెస్టులు చేశారు.గజ్వెల్ కు చెందిన మురళి ముదిరాజ్ ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ ఎవరి కోసం వచ్చింది.. కేసీఆర్ కు ఏడేళ్ళల్లో అప్పటికే ముఖ్యమంత్రి, మంత్రులు, అనేక పదవులు ఇచ్చాము..

    అక్టోబర్ నుంచి 2 నుంచి డిసెంబర్ 9 వరకు నిరుద్యోగ ధర్మ యుద్ధం చేద్దాం .. పరేడ్ గ్రౌండ్ పో ధర్మ యుద్ధం చేద్దాం.. కేసీఆర్ ను ఘోరీ కడుదాం.. తెలంగాణ లో ఉన్న యువత కళ్ళు తెరిస్తే కేసీఆర్ మాడి మసై పోతారు..’’ అని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.