https://oktelugu.com/

Char Dham Yatra: నేటి నుంచి చార్ ధామ్ యాత్ర షురూ..

భారత దేశంలోని అత్యంత పవిత్రమైన తీర్ధ యాత్రల్లో ఉత్తరాఖండ్ చార్ ధామ్ ఒకటి. చార్ ధామ్ యాత్ర శనివారం నుంచి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా తీవ్ర స్థాయిలో ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికులకు టీకాను తప్పనిసరి చేసింది. గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్ నాథ్ ఆలయాలకు వచ్చే యాత్రికులు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్లు సర్టిఫికెట్ ను సమర్పించాలని తెలిపింది. వ్యాక్సిన్ తీసుకోని వారు ఆర్టీపీసీఆర్ నెగటివ్ […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : September 18, 2021 9:01 am
    Follow us on

    భారత దేశంలోని అత్యంత పవిత్రమైన తీర్ధ యాత్రల్లో ఉత్తరాఖండ్ చార్ ధామ్ ఒకటి. చార్ ధామ్ యాత్ర శనివారం నుంచి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా తీవ్ర స్థాయిలో ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికులకు టీకాను తప్పనిసరి చేసింది. గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్ నాథ్ ఆలయాలకు వచ్చే యాత్రికులు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్లు సర్టిఫికెట్ ను సమర్పించాలని తెలిపింది.

    వ్యాక్సిన్ తీసుకోని వారు ఆర్టీపీసీఆర్ నెగటివ్ రిపోర్టును సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కేరళ, మహారాష్ట్ర, ఏపీ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు పుర్తిస్థాయిలో వ్యాక్సిన్ తీసుకుని 15 రోజులు పూర్తయితేనే యాత్రకు అనుమతిస్తామని ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. బద్రీనాథ్ కు రోజుకు వెయ్యి మంది చొప్పున కేదార్ నాథ్ కు 8 వందల మంది,  గంగోత్రి 600, యమునోత్రికి 400 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.

    అద్భుతమైన చార్ ధామ్ యాత్ర అనేది వివిధ దేవతలకు ప్రార్థనలు చేయడానికి చేపట్టిన తీర్ధయాత్ర, ఈ యాత్రలో యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్, కేదార్ నాథ్ వంటి గమ్యస్థానాలు ఉంటాయి. శ్రీ ఆది శంకరాచార్య సుమారు 1200 సంవత్సరాల క్రితం చార్ ధామ్ యాత్రకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి ఈ తీర్ధయాత్ర సంప్రదాయం నిరాటంకంగా కొనసాగుతూ వస్తుంది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే యాత్రికులు వస్తారు. దీపావళి తరువాత శీతాకాలంలో ఎముకలు కొరిే చలి, మంచు కారణంగా ఈ ఆలయాల ద్వారాలను మూసి వేస్తారు.