Revanth Reddy: కేసీఆర్, అమిత్ షాను ఇరికించేసిన రేవంత్ రెడ్డి

Revanth Reddy: మలయాళ బూతు సినిమా లా బీజేపీ ,కేటీఆర్ మాటలు ఉన్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ, టిఆర్ఎస్ ల ట్రాప్ లో మేము పడమని స్పష్టం చేశారు. హోం మంత్రి గా అమిత్ షా చౌకబారు విమర్శలు చేసారని ఆరోపించారు. కేసీఆర్ అవినీతి కి పాల్పడ్డారని విమర్శించిన అమిత్ షా..కేంద్ర హోంశాఖ మంత్రి గా ఎందుకు విచారణ కు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. ఈ ప్రశ్నతో అటు కేసీఆర్ […]

Written By: NARESH, Updated On : May 17, 2022 11:25 am
Follow us on

Revanth Reddy: మలయాళ బూతు సినిమా లా బీజేపీ ,కేటీఆర్ మాటలు ఉన్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ, టిఆర్ఎస్ ల ట్రాప్ లో మేము పడమని స్పష్టం చేశారు. హోం మంత్రి గా అమిత్ షా చౌకబారు విమర్శలు చేసారని ఆరోపించారు. కేసీఆర్ అవినీతి కి పాల్పడ్డారని విమర్శించిన అమిత్ షా..కేంద్ర హోంశాఖ మంత్రి గా ఎందుకు విచారణ కు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. ఈ ప్రశ్నతో అటు కేసీఆర్ ను ఇటు అమిత్ షా మధ్య బంధాన్ని బయటపెట్టి రేవంత్ రెడ్డి ఇరికించేశారు.

Revanth Reddy

అధికారం తమ దగ్గర పెట్టుకుని చౌకభారు విమర్శలు చేయడం ఎందుకని.. అవినీతి కి పాల్పడిన కేసీఆర్ కు అమిత్ షా మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. దేశంలో చాలా రాష్ట్రాల్లో బీజేపీ ఎన్నికలకు కేసీఆర్ డబ్బు సమకూరుస్తున్నాడని రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు. సొంత పార్టీ నేతల పైన ,ప్రతిపక్ష పార్టీ నేతల పైన ఈడీ ,సీబీఐ విచారణ కు ఆదేశిస్తున్న బీజేపీ.. 8 ఏళ్ళుగా కేసీఆర్ పై ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్, బీజేపీ లోపాయికారి ఒప్పందాలతోనే ఇదంతా జరుగుతోందని.. కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకే ఇలా చేస్తున్నారని విమర్శించారు.

వరంగల్ డిక్లరేషన్ , ఉదయ్ పూర్ చింతన్ శిబిర్ నిర్ణయాలను అభినందిస్తూ ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. జాతీయస్థాయిలో బీజేపీ, రాష్ట్రస్థాయిలో టిఆర్ఎస్ మతాలు, కులాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ లబ్ధి పొందుతున్నారు.. దేశ ప్రజల ఐక్యత కోసం కాంగ్రెస్ జోడో భారత్ కార్యక్రమం తీసుకున్నాం.. తెలంగాణ రైతు లకు కేసీఆర్, మోడీ మరణ శాసనం రాస్తున్నారు. మే 21 నుంచి జూన్ 21 వరకు నెల రోజుల పాటు రైతు రచ్చబండ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించాం.. వరంగల్ డిక్లరేషన్ ను ఫ్లెక్సీలు , కరపత్రాలు పంచడం ద్వారా ప్రచారం చేస్తాం.. 400మంది పార్టీ ముఖ్యనేతలతో గ్రామాల్లో రైతు రచ్చబండ నిర్వహిస్తాం..

మే 21 లోపు అన్ని జిల్లాల్లో కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి.. టీ పీసీసీ నిర్ణయాలను ఆమోదించాలని ఆదేశించాం.. జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా డబ్బు చప్పుళ్ళ ద్వారా వరంగల్ డిక్లరేషన్ ను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఐకేపీ కేంద్రాలు , రైతు బజార్ , వైన్ షాపులు , కళ్ళు కాంపౌండ్ ల ముందు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తామని రేవంత్ తెలిపారు.

Also Read: Viral Photo: క్యూట్ గా ఉన్న ఈ పాప ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతోంది.. ఎవరో తెలుసా?

స్వయంగా నేనే వైన్ షాపుల దగ్గర ఫ్లెక్సీలు పెడతా.. నేను మే 21న వరంగల్ జిల్లా లో ప్రొఫెసర్ జయశంకర్ సొంత గ్రామంలో రైతు రచ్చబండ నిర్వహిస్తానని రేవంత్ అన్నారు. వరంగల్ సభ నిర్వహణ పై చింతన్ శిబిర్ లో చర్చ జరిగింది..సభ భాగా నిర్వహించామని అందరూ అన్నారు.. అక్టోబర్ 2 నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ..రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణ నుంచే మొదలు పెట్టాలని తీర్మానం చేసి ఏఐసీసీ కి పంపించాం..లేఖ కూడా రాస్తామని రేవంత్ అన్నారు.

తుక్కుగూడ తుక్కు తుక్కు సభ..చెత్త చెత్త మాటలు..బీజేపీ సభలో తెలంగాణ ప్రజలకు ఏం చేస్తారో ఓక్క మాటైనా చెప్పారా.. బీజేపీ, టిఆర్ఎస్ నేతలు వరంగల్ డిక్లరేషన్ పై ఎందుకు మాట్లాడరు..తిట్ల ను ఎజెండా గా చేసుకుని టిఆర్ఎస్ ,బీజేపీ లు పబ్బం గడుపుతున్నాయి.. మా డిక్లరేషన్ లో లోటు పాట్లు ఉంటె ఎత్తి చూపాలి..లేదంటే ఇంతకంటే బెటర్ గా ఏం చేస్తామనేది బీజేపీ ,టిఆర్ఎస్ లు చెప్పాలి. కానీ ఈ రెండు పార్టీ లు ఏం చెప్పలేక పోతున్నాయి. కాంగ్రెస్ డిక్లరేషన్ పై చర్చ జరగకుండా టిఆర్ఎస్, బీజేపీ నాటకాలాడుతున్నాయని రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు.

Telangana Congress

Also Read: Gautam Adani: రాజ్యసభ ఆశావహుల నుంచి అదానీ ఔట్… ఆ స్థానం ఎవరికిస్తారంటే?

Recommended Videos:

Tags