Viral Photo: క్యూట్ గా ఉన్న ఈ పాప ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతోంది.. ఎవరో తెలుసా?

Viral Photo: ఆర్ఆర్ఆర్ లోని చిన్న పిల్లను తలపిస్తున్న ఈ క్యూట్ అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా? చేతిలో ఒక స్వీటును పట్టుకొని తండ్రికి తినిపిస్తున్న ఈ పాప ఎవరో తెలిస్తే నిజంగానే మీరు షాక్ అవుతారు. క్యూట్ గా ఉన్న ఈమె ప్రస్తుతం సంగీత ప్రపంచాన్ని ఏలుతోంది. రమ్య బెహారా.. ఇప్పుడు బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక చిత్రంలో పాటలు పాడి ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. సింగర్ గా టీవీ షోలలో పాడి అలరించిన రమ్య బెహారాను […]

Written By: NARESH, Updated On : May 17, 2022 4:00 pm
Follow us on

Viral Photo: ఆర్ఆర్ఆర్ లోని చిన్న పిల్లను తలపిస్తున్న ఈ క్యూట్ అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా? చేతిలో ఒక స్వీటును పట్టుకొని తండ్రికి తినిపిస్తున్న ఈ పాప ఎవరో తెలిస్తే నిజంగానే మీరు షాక్ అవుతారు. క్యూట్ గా ఉన్న ఈమె ప్రస్తుతం సంగీత ప్రపంచాన్ని ఏలుతోంది.

రమ్య బెహారా.. ఇప్పుడు బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక చిత్రంలో పాటలు పాడి ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. సింగర్ గా టీవీ షోలలో పాడి అలరించిన రమ్య బెహారాను ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ప్రోత్సహించి సినిమాల్లో అవకాశం ఇవ్వడంతో ఇక వెనుదిరిగి చూసుకోలేదు.

ప్రస్తుతం రమ్య బెహార టాలీవుడ్ లో ప్రముఖ సింగర్ గా దూసుకుపోతోంది. ఈ అమ్మాయిది ఏపీలోని గుంటూరు జిల్లా నరసరావుపేటలో 1994, ఫిబ్రవరి 1 జన్మించింది. పెరిగింది హైదరాబాద్ లో కావడం విశేషం.

Also Read: IPL 2022- RCB: ఆర్సీబీని చూసి బుద్ధి తెచ్చుకోవాల్సిందేనా?

రమ్య బెహారా రామాచారి గారి వద్ద సంగీత పాఠాలు నేర్చుకొంది. అనంతరం వివిధ పాటల పోటీల్లో పాల్గొని మంచి టాలెంట్ ఉందని ప్రూవ్ చేసుకుంది. తన గాత్రంతో శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేసింది.

ఈ క్రమంలోనే టాలీవుడ్ అగ్ర సంగీత దర్శకుడు కీరవాణి మెప్పు పొంది ‘వెంగమాంబ’ మూవీతో ఆమె పాటల ప్రయాణం మొదలైంది. ఆపై ‘లచ్చందేవికి ఓ లక్కుంది’, కృష్ణాష్టమి, బ్రూస్ లీ, బాహుబలి, టెంపర్, ఒక లైలా కోసం, ప్రేమా కథ చిత్రం, లౌక్యం, కొత్త జంట, చిన్నదాన నీ కోసం, దిక్కులు చూడకు రామయ్యా, ఇస్మార్ట్ శంకర్, రెడ్, రంగ్ దే, శతమానం భవంతి, క్రాక్,ఆచార్య సినిమాలో మంచి పాటలు పాడింది.

ఈ యువ గాయని ప్రస్తుతం కొన్ని కన్నడ, తమిళ్, హిందీ సినిమాల్లో కూడా పాడుతూ బిజీ ఆర్టిస్ట్ గా మారింది. గాత్రమే కాదు.. చాలా అందం కూడా రమ్య బెహారా సొంతం. ఆమెకు యూత్ లో విపరీతమైన అభిమానం ఉంది.

Also Read: Akkineni Akhil: షూటింగ్ సెట్స్ లో డైరెక్టర్ సురేందర్ రెడ్డి పై అక్కినేని అఖిల్ ఫైర్.

కాగా రమ్య బెహారా చిన్ననాటి ఫొటో నెట్టింట్లో వైరల్ గా మారింది. అందులో ఆమెను చూసిన నెటిజన్లు అసలు గుర్తించలేకపోయారు. ఈమెనే రమ్యనా? అని కామెంట్లు పెడుతున్నారు.

 

Recommended Videos