Revanth Reddy: ప్రణాళిక లేకుండానే రేవంత్ రెడ్డి పోరాటం.. ‘కేసీఆర్ ఫాంహౌస్ లో రచ్చబండ’ ఫ్లాప్?

Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ కు పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం అయ్యాక ఆ పార్టీకి జవసత్వాలు వచ్చాయి. రేవంత్ దూకుడు పాలిటిక్స్ తో టీఆర్ఎస్ కు చమటలు పట్టిస్తున్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి ప్రతీ విషయంలోనూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కార్యవర్గ పగ్గాలు చేపట్టిన నాటి నుంచే గిరిజన దండోరా సభలంటూ పార్టీ నాయకుల్లో ఉత్తేజాన్ని నింపారు. ఆ తరువాత ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలపై పోరాటాలు […]

Written By: NARESH, Updated On : December 27, 2021 5:50 pm
Follow us on

Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ కు పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం అయ్యాక ఆ పార్టీకి జవసత్వాలు వచ్చాయి. రేవంత్ దూకుడు పాలిటిక్స్ తో టీఆర్ఎస్ కు చమటలు పట్టిస్తున్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి ప్రతీ విషయంలోనూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కార్యవర్గ పగ్గాలు చేపట్టిన నాటి నుంచే గిరిజన దండోరా సభలంటూ పార్టీ నాయకుల్లో ఉత్తేజాన్ని నింపారు. ఆ తరువాత ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలపై పోరాటాలు చేస్తున్నారు.

Revanth Reddy arrest

తాజాగా కేసీఆర్ ఫాంహౌస్ ఉన్న ఎర్రవెల్లిలో రచ్చబండ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి నిర్వహించతలపెట్టారు. కానీ దీనిని ఆ పార్టీ నాయకులు సక్సెస్ చేసుకోలేకపోయారు. ఎందుకంటే కేసీఆర్ ఫాం హౌస్ వద్ద ఎప్పుడు భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. అలాంటిది ఇక్కడ ఆందోళన కార్యక్రమాలకు పోలీసులు ఎలా అనుమతిస్తారు..? అందుకే పార్టీ నాయకులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేసి కట్టడి చేశారు.

వరిధాన్యం కొనుగోళ్ల విషయంలో కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. రైతులను వరి పంట వేయొద్దని చెప్పిన కేసీఆర్ వందల ఎకరాల్లో వరిని ఎలా సాగుచేస్తారని రేవంత్ రెడ్డి సంచలన  ఆరోపణలు చేశారు ఆ బండారాన్ని బయటపెట్టేందుకే ఎర్రవెల్లి రచ్చబండ కార్యక్రమాన్ని తలపెట్టారు అయితే ఈ కార్యక్రమం గురించి పార్టీ ముందుగానే ప్రకటించడంతో పోలీసులు ఎక్కడికక్కడ అలర్ట్ అయ్యారు. ఇక్కడి కార్యక్రమానికి వెళ్లకుండా పార్టీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు.

అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ కార్యక్రమం చేపట్టినా హౌస్ అరెస్టులకే పరిమితమవుతోందని కొందరు సెటైర్లు వేస్తున్నారు. అత్యంత భద్రత ఉండే సీఎం కేసీఆర్ ఫాం హౌస్ కు కాంగ్రెస్ నాయకులు ఎలా వెళుతారు..? అని ప్రశ్నిస్తున్నారు.  కేసీఆర్ సాగు చేసిన పంటను చూపించడానికే అని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నా అది సాధ్యమయ్యే పనేనా..? అని కొందరు చర్చించుకుంటున్నారు. కేసీఆర్ ఫాం హౌస్ కు వెళ్లకుండా హౌస్ అరెస్టు చేయిస్తారని తెలిసినా ప్లాన్ లేకుండా సాగారని విమర్శిస్తున్నారు.

కాంగ్రెస్ నాయకులు ముందస్తు ప్లాన్ లేకుండా ఈ కార్యక్రమం ఫెయిల్ అయిందని కొందరు అంటున్నారు. ముందస్తు ప్రణాళిక లేకుండా ఇక్కడికి వెళ్లడం సాధ్యం కాదన్న విషయం వారికి తెలియదా..? అని అంటున్నారు. గత కొన్ని నెలలుగా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా ఇలా ఫెయిల్ అవుతున్నారని అంటున్నారు. నాలుగేళ్లుగా నిర్వహిస్తున్న ప్రతీ కార్యక్రమం విజయవంతంగా చేయలేకపోతున్నారని అంటున్నారు. అయితే కొత్త పాలక వర్గం ఏర్పాటైన తరువాత సభలు, సమావేశాలతో పార్టీ నాయకుల్లో ఉత్తేజాన్ని నింపినా.. ప్రజలు ఆదరించే కార్యక్రమాన్ని చేయలేకపోతున్నారని అంటున్నారు.

ముందస్తు అరెస్టుల గురించి కాంగ్రెస్ నాయకులకు తెలియంది కాదు. కానీ ఎలాగైనా నిర్వహించి తీరుతామని బీరాలకు పోయారు. అయితే పోలీసులకు వారిని కట్టడి చేయకుండా ఊరుకుంటారా..? అన్నది గ్రహించలేకపోయారు. అలాంటప్పుడు సాధ్యం కానీ, ఎమోషనల్ ప్రకటనలు ఎలా ఇస్తారని అంటున్నారు. అయితే ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు వ్యూహం మార్చి ప్రజలు ఆదరించే ఆందోళన కార్యక్రమాలు చేయాలని అంటున్నారు. మరి టీపీసీసీ వ్యూహం ఎలా ఉంటుందో చూద్దాం..