https://oktelugu.com/

Bollywood Jersey Movie: ‘జెర్సీ’కి  కలెక్షన్స్  వస్తేనే   దిల్ రాజుకి ఊరట !   

Bollywood Jersey Movie: తెలుగు సినిమా అగ్ర నిర్మాతలు  ‘దిల్ రాజు, అల్లు అరవింద్’  కలిసి  ఒక హిందీ సినిమాను నిర్మించారు.  పైగా  నాని హీరోగా వచ్చిన  “జెర్సీ” సినిమాకి  అది రీమేక్.  అందుకే, ఈ సినిమా పై బాలీవుడ్ లో మంచి అంచనాలు ఉన్నాయి.  బాలీవుడ్  స్టార్ హీరో  షాహిద్ కపూర్ హీరోగా  నటించాడు.  కాబట్టి  ఈ  సినిమాకి  భారీ ఓపెనింగ్స్ వస్తాయని నమ్మకంగా ఉన్నారు మేకర్స్.       ఐతే, బాలీవుడ్ లో ఇప్పుడు ఏ సినిమాకి  భారీ […]

Written By:
  • Shiva
  • , Updated On : December 27, 2021 / 05:43 PM IST
    Follow us on

    Bollywood Jersey Movie: తెలుగు సినిమా అగ్ర నిర్మాతలు  ‘దిల్ రాజు, అల్లు అరవింద్’  కలిసి  ఒక హిందీ సినిమాను నిర్మించారు.  పైగా  నాని హీరోగా వచ్చిన  “జెర్సీ” సినిమాకి  అది రీమేక్.  అందుకే, ఈ సినిమా పై బాలీవుడ్ లో మంచి అంచనాలు ఉన్నాయి.  బాలీవుడ్  స్టార్ హీరో  షాహిద్ కపూర్ హీరోగా  నటించాడు.  కాబట్టి  ఈ  సినిమాకి  భారీ ఓపెనింగ్స్ వస్తాయని నమ్మకంగా ఉన్నారు మేకర్స్. 
     

    Bollywood Jersey Movie

     
     ఐతే, బాలీవుడ్ లో ఇప్పుడు ఏ సినిమాకి  భారీ ఓపెనింగ్స్ వచ్చేలా లేదు  పరిస్థితి.   కోవిడ్ థ‌ర్డ్ వేవ్ ఉధృతి రోజు రోజుకు పెరుగుతుందని..  మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకుంది.   అందులో భాగంగా.. మ‌హారాష్ట్ర‌లో   నైట్ క‌ర్‌ఫ్యూ విధించింది. అలాగే  థియేట‌ర్ల‌లో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధ‌నను కూడా  పెట్టింది.   ఈ మేరకు  జీవో కూడా  జారీ చేసింది.  

    Also Read: Pushpa: పుష్పలో ఆ సీన్​ను సుకుమార్​ నగ్నంగా చూపించాలనుకున్నాడట!

     
     
    కాబట్టి,   “జెర్సీ” సినిమాకి ఇది పెద్ద దెబ్బ.  అసలు రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన  ’83’ సినిమా పై  భారీ అంచనాలు ఉన్నాయి.  ఈ సినిమా కోసం ఎంతగానో ప్రేక్షకులు ఎదురుచూశారు. పైగా ఈ సినిమా పాన్ ఇండియా సినిమా.  కానీ, ఈ సినిమాకి  ఓ మోస్తరు కలెక్షన్స్  మాత్రమే  వచ్చాయి.  అందుకే,  షాహిద్ కపూర్ సినిమాకి  ఏ రేంజ్  ఓపెనింగ్స్  వస్తాయనే డౌట్ కలుగుతుంది. 
     
     
    అయితే,  షాహిద్ కపూర్  గత సినిమా  ‘కబీర్ సింగ్’  బాలీవుడ్ లో అద్భుత  విజయం సాధించింది. ఏకంగా ఆ సినిమా  300 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. కానీ, అప్పుడు థియేటర్స్ ఫుల్ గా ఉన్నాయి.  ఇప్పుడు ఆ స్థితి లేదు.  మరి, ఈ నేపథ్యంలో   “జెర్సీ”కి భారీ కలెక్షన్స్  వస్తాయా ?  ఈ సినిమాకి కలెక్షన్స్ వస్తేనే.. మన తెలుగు నిర్మాతలు అక్కడ నిలబడగలిగేది. 
     
     
     
    ఇప్పటికే దిల్ రాజ్  బాలీవుడ్ లో కూడా   అనేక సినిమాల నిర్మాణాన్ని  ప్లాన్ చేసుకున్నాడు.  ఆ సినిమాలకు కూడా ఊపు రావాలి అంటే..   “జెర్సీ”  అద్భుత విజయం సాధించాలి. అప్పుడే,  తెలుగు నిర్మాతలకు హిందీలో పట్టు పెరుగుతుంది.   ఇక హిందీలో కూడా తెలుగులో డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరి తీశారు.  షాహిద్ కి హీరోయిన్ గా  ఈ సినిమాలో  మృణాల్‌ ఠాకూర్‌ కనిపించనుంది.  
     
     
     అయితే తెలుగు జెర్సీలో కొన్ని మార్పులు చేసి  హిందీలోకి తెరకెక్కిస్తున్నారు. మెయిన్ గా హీరో కొడుకు పాత్రను కొత్తగా రాసినట్లు తెలుస్తోంది. తండ్రి పాత్ర మధ్యలో ఆపేసిన  క్రికెట్ జర్నీని,  కొడుకు పాత్ర కంటిన్యూ చేస్తోందట.   
    Tags