https://oktelugu.com/

Mahesh Babu: ప్చ్.. ఏమిటి మహేష్ ఇలా అయిపోయాడు ?

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు అంటేనే.. ఆరు అడుగుల అందగాడు అని పేరు. పైగా స్టైల్ లో కూడా మహేష్ లుక్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. అందుకే, ఏ ఫ్రేమ్ పెట్టుకున్నా.. చాలా అందంగా కనిపిస్తాడు అని మహేష్ కి ఒక ముద్ర పడిపోయింది. అలాంటి మహేష్ నుంచి వచ్చిన ఓ ఫొటోలో మాత్రం మహేష్ లుక్స్ అసలు బాగాలేదు. ఏమిటి మహేష్ ఇలా ఉన్నాడు ? అంటూ ఫ్యాన్స్ కూడా కాస్త […]

Written By:
  • Shiva
  • , Updated On : December 27, 2021 / 06:11 PM IST
    Follow us on

    Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు అంటేనే.. ఆరు అడుగుల అందగాడు అని పేరు. పైగా స్టైల్ లో కూడా మహేష్ లుక్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. అందుకే, ఏ ఫ్రేమ్ పెట్టుకున్నా.. చాలా అందంగా కనిపిస్తాడు అని మహేష్ కి ఒక ముద్ర పడిపోయింది. అలాంటి మహేష్ నుంచి వచ్చిన ఓ ఫొటోలో మాత్రం మహేష్ లుక్స్ అసలు బాగాలేదు. ఏమిటి మహేష్ ఇలా ఉన్నాడు ? అంటూ ఫ్యాన్స్ కూడా కాస్త నిరుత్సాహ పడ్డారు.

    మహేష్ తన తదుపరి సినిమాని త్రివిక్రమ్ తో ప్లాన్ చేస్తున్నాడు. కాగా తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ ట్వీట్ పెట్టాడు. ఈ రోజు మధ్యాహ్నం మంచి టీమ్ తో డీసెంట్ వర్క్ జరిగిందని మహేష్ మెసేజ్ కూడా పోస్ట్ చేశాడు. ఆ మెసేజ్ తో పాటు డైరెక్టర్ త్రివిక్రమ్, నిర్మాత వంశీ మరియు మ్యూజికల్ సెన్సేషన్ థమన్ తో కలిసి దిగిన ఫోటోను కూడా మహేష్ పోస్ట్ చేశాడు.

    Also Read: Bollywood Jersey Movie: ‘జెర్సీ’కి  కలెక్షన్స్  వస్తేనే   దిల్ రాజుకి ఊరట !   

    ఈ ఫోటోను బట్టి త్రివిక్రమ్ -మహేష్ సినిమా గ్రౌండ్ వర్క్ జరుగుతుందని క్లారిటీ వచ్చింది. అయితే, మహేష్ పోస్ట్ చేసిన ఈ ఫోటోలో మహేష్ లుక్ కాస్త కొత్తగా ఉంది. కొత్తగా ఉంది అనేకంటే అసలు బాగాలేదు అనడం కరెక్ట్. మహేష్ పెట్టుకున్న స్టైలిష్ గాగుల్స్.. అసలు మహేష్ కి స్టైల్ గా లేవు. అలాగే మహేష్ హెయిర్ స్టైల్ కూడా బాగాలేదు.

    డిఫరెంట్ గా ఉందని మహేష్ ఇలా ట్రై చేసి ఉంటాడు. అయితే, ఈ లుక్ అండ్ స్టైల్ సూపర్ స్టార్ కు అసలు సూట్ కాలేదు. అలాగే ఏ మాత్రం సెట్ కాలేదు. మరి త్రివిక్రమ్ తో చేయబోయే సినిమాలో మహేష్ ఇదే లుక్ లో కనిపిస్తాడా ? అనే భయం పట్టుకుంది ఫ్యాన్స్ కి. ఏది ఏమైనా ఈ లుక్ మాత్రం అసలు బాగాలేదు. కాబట్టి.. ఈ ఫోటో కింద వచ్చే నెగిటివ్ కామెంట్స్ చూశాక అయినా మేకర్స్ కి ఈ లుక్ ఫీడ్ బ్యాక్ అర్ధమవుతుంది. కాబట్టి లుక్ మారుస్తారు.

    ఇక మాటల మాంత్రికుడు ‘త్రివిక్రమ్’ ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా తీసుకురాబోతున్నాడు. ప్రజెంట్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాకి బజ్ క్రియేట్ చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు త్రివిక్రమ్. మరి ఆ రేంజ్ లో బజ్ క్రియేట్ అవుతుందో లేదో చూడాలి.

    Also Read: Pushpa: పుష్పలో ఆ సీన్​ను సుకుమార్​ నగ్నంగా చూపించాలనుకున్నాడట!

    Tags