Revanth Reddy : నాయకుడంటే నడిపించాలి. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాలి. నేనున్నాననే ధైర్యాన్ని ఇవ్వాలి. అప్పుడే ఆ నాయకుడిపై ప్రజలకు భరోసా ఏర్పడుతుంది. సరిగ్గా అలాంటి భరోసాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల్పించారు. చావు బతుకుల మధ్య ఉన్న ఓ యువకుడికి ప్రాణభిక్ష పెట్టారు. “నేనున్నానని నీకేం కాదనే భరోసాను” ఆ యువకుడికి ఇచ్చారు.
నవీన్ అనే 18 సంవత్సరాల యువకుడు రక్త క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. పేద కుటుంబం కావడంతో ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా మొదటి దాకా హైదరాబాదులోని బసవతారకం ఆసుపత్రిలో చికిత్స పొందాడు. అతడికి ఉన్న అనారోగ్యం దృష్ట్యా శస్త్ర చికిత్స నిర్వహించాల్సి ఉంది. అయితే ఆ శస్త్ర చికిత్స ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా చేయడానికి వీల్లేదు. పైగా అది అత్యంత ఖర్చుతో కూడుకున్నది. ఆరోగ్యశ్రీ కార్డు మీద చేయలేమని చెప్పి బసవతారకం ఆసుపత్రి యాజమాన్యం అతడిని డిశ్చార్జ్ చేసింది. దీంతో ఆ యువకుడి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ కొడుకు పరిస్థితి ఏమిటని నిర్వేదంలో మునిగిపోయారు.
అయితే ఈ విషయాన్ని కొంతమంది నెటిజెన్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ట్విట్టర్ ఎక్స్ ద్వారా తీసుకుపోయారు. దీంతో వెంటనే ముఖ్యమంత్రి స్పందించారు..”అత్యంత చిన్న వయసులో నవీన్ రక్త క్యాన్సర్ వ్యాధి బారిన పడటం బాధాకరం. ఆరోగ్యశ్రీ జాబితాలో వర్తించదని బసవతారకం ఆసుపత్రి యాజమాన్యం అతడిని డిశ్చార్జ్ చేసిందని తెలిసింది. అతని అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వమే అతనికి కావలసిన చికిత్సను అందిస్తుంది. అందుకు సంబంధించిన ఖర్చులు మొత్తం భరిస్తుంది. నిమ్స్ ఆసుపత్రి వైద్యులు అతడికి మెరుగైన చికిత్స అందిస్తారు. త్వరలో నవీన్ పూర్తి ఆరోగ్యవంతుడై మన ముందుకు వస్తాడని ఆశిద్దామని” రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో పేర్కొన్నారు.
Please help @revanth_anumula https://t.co/fKqMu11LMN
— Rohini Singh (@rohini_sgh) March 3, 2024
నవీన్ బాధను చూసి వెంటనే స్పందించిన ముఖ్యమంత్రిని నెటిజన్లు అభినందిస్తున్నారు. అన్నా అని పిలవగానే సాయం అందించారని.. దటీజ్ రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ రెడ్డి వెంటనే స్పందించడం పట్ల నవీన్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు చెబుతున్నారు. తమ కొడుకు ప్రాణం కాపాడాలని కొనియాడుతున్నారు. కాగా, ప్రస్తుతం నవీన్ నిమ్స్ ఆస్పత్రి లో చికిత్స పొందుతున్నట్టు తెలిసింది. అతడికి అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన తర్వాత శస్త్ర చికిత్స జరుపుతామని వైద్యులు చెబుతున్నారు.
It's painful to learn about Naveen, who is battling rare cancer at such a young age.
I’ve directed the authorities to contact his family and make all necessary arrangements for treatment. The government will bear the expenses and make the necessary arrangements for the… https://t.co/8vSc4gVIf4
— Revanth Reddy (@revanth_anumula) March 4, 2024