https://oktelugu.com/

Hansika Motwani : చిన్న గౌనులో కాకరేపుతున్న హన్సిక.. ఫోటోలు వైరల్

ఇక ఇటీవల హన్సిక తన అందమైన ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేసింది.. సోషల్ మీడియాలో హన్సిక యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. ఇటీవల స్ట్రీమింగ్ అవుతున్న మై నేమ్ ఇస్ శృతి అనే వెబ్ సిరీస్ ప్రచారంలో భాగంగా ఆమె ఫోటోషూట్ నిర్వహించింది.

Written By:
  • NARESH
  • , Updated On : March 4, 2024 / 06:01 PM IST
    Follow us on

    Hansika Motwani : 2003లో హృతిక్ రోషన్ హీరోగా విడుదలైన కోయి మిల్ గయా అనే సినిమాతో హన్సిక సినీ రంగ ఆరంగేట్రం జరిగింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 18 సంవత్సరాల క్రితం విడుదలైన దేశముదురు అనే సినిమా ద్వారా హన్సిక టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. తన తొలి చిత్రంతోనే అల్లు అర్జున్ లాంటి నటుడితో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అప్పటినుంచి ఇప్పటిదాకా ఆమె అలరిస్తూనే ఉంది. కెరియర్ ప్రారంభంలో టాప్ హీరోలతో హన్సిక నటించింది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనే ఉద్దేశంతో కోలీవుడ్, బాలీవుడ్ లోనూ నటించింది. టాలీవుడ్ లో కొన్ని సంవత్సరాలపాటు అగ్ర కథానాయకగా వెలుగొందింది. ముఖ్యంగా తమిళనాడులో ఈమెకు అభిమానులు గుడి కట్టారంటే అతిశయోక్తి కాదు.

    కెరియర్ ప్రారంభంలో దేశముదురు, కందిరీగ, మస్కా, కంత్రీ వంటి సినిమాలో నటించినప్పటికీ హన్సిక కెరియర్ అనుకున్నంత వేగంగా కదలలేదు. తమిళంలో పులి, రోమియో జూలియట్, వేలాయుధం, మై నేమ్ ఇస్ చంద్రకళ, ఓర్ కల్ ఓర్ కన్నాడి అనే చిత్రాల్లో నటించి అలరించింది. వాలు అనే సినిమాలో నటిస్తున్నప్పుడు శింబుతో ప్రేమలో పడినట్టు వార్తలు వినిపించాయి. పెళ్లి కూడా చేసుకుంటారనే క్రమంలో ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నట్టు తమిళ మీడియా కోడై కూసింది.

    ఆ తర్వాత కొంతకాలం పాటు తమిళంలో అడపా దడపా సినిమాల్లో కనిపించింది హన్సిక. 2022లో సోహైల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమె నటనకు విరామం ప్రకటించలేదు. ఎం వై త్రీ, మై నేమ్ ఇస్ శృతి అనే ఓ వెబ్ సిరీస్ లలో నటించి అలరించింది.. సినిమా అవకాశాలు రాకపోతుండడంతో ప్రస్తుతం హన్సిక వెబ్ సిరీస్ లపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది..

    ఇక ఇటీవల హన్సిక తన అందమైన ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేసింది.. సోషల్ మీడియాలో హన్సిక యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. ఇటీవల స్ట్రీమింగ్ అవుతున్న మై నేమ్ ఇస్ శృతి అనే వెబ్ సిరీస్ ప్రచారంలో భాగంగా ఆమె ఫోటోషూట్ నిర్వహించింది. గతంలో బొద్దుగా ఉన్న హన్సిక.. ఇప్పుడు సన్నగా మారడంతో మరింత అందంగా కనిపిస్తోంది. దానికి తోడు పొట్టి గౌను ధరించడంతో కొంటెగా దర్శనమిస్తోంది. ప్రస్తుతం హన్సిక ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.