https://oktelugu.com/

CM Revanth Reddy: ఏపీలో అడుగుపెట్టనున్న రేవంత్.. టార్గెట్ ఫిక్స్

సార్వత్రికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందని సర్వేలు తేల్చి చెప్తున్నాయి. దీంతో అదే ఊపుతో ఏపీలో సైతం కాంగ్రెస్ నిలదొక్కునేలా చూడాలని రేవంత్ కు హై కమాండ్ నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది.

Written By:
  • Dharma
  • , Updated On : February 24, 2024 / 11:03 AM IST
    Follow us on

    CM Revanth Reddy: తెలుగు రాష్ట్రాల సీఎంలకు సారుప్యత ఉంది. ఇద్దరూ ఒకేసారి పొలిటికల్ కెరీర్ ప్రారంభించారు. స్వతహాగా రాజకీయ నేపథ్యం ఉన్న జగన్ 2009లో కడప ఎంపీగా గెలుపొందారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019లో జగన్ సీఎం కాగా.. 2023లో రేవంత్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇద్దరికీ పెద్దగా పరిచయం లేదు. దాదాపు ఒకే వయసు ఉంటుంది. గత మూడు నెలలుగా రేవంత్ పాలనకు తెలంగాణలో మంచి మార్కులే పడ్డాయి. ఈ నేపథ్యంలో ఏపీలో ఎన్నికల సమీపిస్తుండడంతో రేవంత్ కు కాంగ్రెస్ హై కమాండ్ ప్రత్యేక టాస్క్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

    సార్వత్రికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందని సర్వేలు తేల్చి చెప్తున్నాయి. దీంతో అదే ఊపుతో ఏపీలో సైతం కాంగ్రెస్ నిలదొక్కునేలా చూడాలని రేవంత్ కు హై కమాండ్ నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ఏపీలో ప్రచారం చేయాలని అగ్రనేతలు సూచించినట్లు సమాచారం. మరోవైపు జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపైనర్లను నియమించింది. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల బాధ్యతను రేవంత్ రెడ్డికి అప్పగించింది.

    ఏపీ సీఎం జగన్ తో పోల్చుకుంటే రేవంత్ రెడ్డి ప్రసంగాలు దూకుడుగా ఉంటాయి. పంచ్ డైలాగులతో కొనసాగుతాయి. అటు ఏపీలో సైతం రేవంత్ అభిమానులు అధికం. ఒకవేళ రేవంత్ కాంగ్రెస్ ప్రచార సభలకు వస్తే యువతలో ఒక రకమైన మార్పు వస్తుందని అనడంలో సందేహం లేదు. ఇప్పటికే వెనుకన ఉన్న కాంగ్రెస్ పార్టీని ముందంజలో తెచ్చిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కుతుంది. అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీయేనా అన్న రీతిలో క్రమశిక్షణ తీసుకువచ్చారు. ఇప్పుడు కానీ ఆయన ఏపీ పై దృష్టి పెడితే మాత్రం యూత్ లో ఒక రకమైన మార్పు రావడం ఖాయమని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన హామీల విషయంలో ఏపీకి అనుకున్నంత స్థాయిలో సాయం అందలేదన్న విమర్శ ఉంది. అయితే రేవంత్ ఏపీలోకి వస్తే జగన్ ను టార్గెట్ చేసుకోవడం ఖాయం. కానీ చంద్రబాబు విషయంలో ఎలా స్పందిస్తారు అన్నది చూడాలి. ఏపీ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని షర్మిల చెబుతున్నారు. అయితే ఆమె జగన్ ను టార్గెట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు రేవంత్ సైతం అదే బాట పడతారా? విపక్షాలన్నింటినీ ఉతికి ఆరేస్తారా? అన్నది చూడాలి.