India Vs England: ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ లో ఇంగ్లాండ్ జట్టు ఆల్ అవుట్ అయింది. శుక్రవారం టాస్ గెలిచి తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. జో రూట్ సెంచరితో కదం తొక్కాడు. ఫోక్స్ 47, క్రావ్ లీ 42, బెయిర్ స్టో 38 తొలి రోజు ఇన్నింగ్స్ లో రాణించారు.
రెండవ రోజు నైట్ వాచ్ మన్ రాబిన్ సన్ తో బ్యాటింగ్ ప్రారంభించిన రూట్..8 వికెట్ కు 102 పరుగులు జోడించాడు. ఈ దశలోనే రాబిన్ సన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రమాదకరంగా మారుతున్న వీరి జోడిని రవీంద్ర జడేజా విడదీశాడు. 102 ఓవర్ లో రవీంద్ర జడేజా వేసిన బంతిని తప్పుగా అర్థం చేసుకున్న రాబిన్సన్.. భారీ షాట్ ఆడబోయి కీపర్ ధృవ్ చేతికి చిక్కాడు. అప్పటికి ఇంగ్లాండ్ స్కోర్ 8 వికెట్ల నష్టానికి 347 పరుగులు. రాబిన్ సన్, రూట్ 8 వ వికెట్ కు 102 పరుగులు జోడించారు. ఇది ఇంగ్లాండ్ నాలుగో టెస్ట్ లో మొదటి ఇన్నింగ్స్ లో నెలకొల్పిన రెండవ అత్యుత్తమ భాగస్వామ్యం. ఆరో వికెట్ కు ఫోక్స్, రూట్ 113 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు..రాబిన్ సన్ ఔట్ అయిన తర్వాత రవీంద్ర జడేజా మిగతా రెండు వికెట్లు తీయడానికి ఎంతో సమయం తీసుకోలేదు. బషీర్, అండర్ సన్ ఖాతా ప్రారంభించకుండానే వెంటవెంటనే అవుట్ అయ్యారు. మరో వైపు 122 పరుగులతో రూట్ నాట్ అవుట్ గా నిలిచాడు. దీంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 334 పరుగులకు ఆల్ అవుట్ అయింది చివరి రోజు మూడు వికెట్లతో మొత్తంగా నాలుగు వికెట్లను రవీంద్ర జడేజా తన ఖాతాలో వేసుకున్నాడు.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా జట్టు నాలుగు పరుగులకే కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. జేమ్స్ అండర్సన్ బౌలింగ్ లో రోహిత్ శర్మ కీపర్ ఫోక్స్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మ అవుట్ కావడంతో వన్ డౌన్ బ్యాటర్ గా గిల్ క్రీజ్ లోకి వచ్చాడు. రెండు వరుస టెస్టుల్లో డబుల్ సెంచరీలు బాదిన యశస్వి..ఈ మ్యాచ్ లోనూ ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ప్రస్తుతం అతడు 20 బంతుల్లో 16 పరుగులు చేశాడు. ఇందులో మూడు ఫోర్లు ఉండటం విశేషం.
Innings Break!
England all out for 353.
4⃣ wickets for @imjadeja
3⃣ wickets for Akash Deep
2⃣ wickets for @mdsirajofficial
1⃣ wicket for @ashwinravi99Scorecard ▶️ https://t.co/FUbQ3Mhpq9 #TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/9UoZalfDYQ
— BCCI (@BCCI) February 24, 2024