
Revanth Reddy: What came out of the secret survey conducted by Revanth Reddy?: కొత్త టీపీసీసీ నియామకానికి ముందు కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ కు పోటీ ఇస్తుందా? అన్న అనుమానాలు మాత్రం కలిగాయి. అదే సమయంలో టీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ ఎదగడంతో ఆపార్టీలోకి వలసలు మొదలయ్యాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రేసులో లేనట్లే అనే టాక్ ఒకనొక సమయంలో వచ్చింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధిష్టానం ఆచితూచి టీపీసీసీ నియామకాన్ని చేపట్టింది. అధిష్టానం చాలా సమయం తీసుకున్నప్పటికీ కాంగ్రెస్ శ్రేణులు కోరుకున్న అభ్యర్థికే టీపీసీసీని కట్టబెట్టింది. రేవంత్ రెడ్డియే టీపీసీసీ చీఫ్ గా నియామకం కావడంతో కాంగ్రెస్ పార్టీలో సరికొత్త జోష్ నెలకొంది.
రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానం పెట్టుకున్న నమ్మకాన్ని నిజంచేసేలా ఆయన ముందుకెళుతున్నారు. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా సరికొత్త కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దళిత, గిరిజన దండోరా సభలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారపార్టీ లక్ష్యంగా రేవంత్ రెడ్డి వ్యూహా ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇదే సమయంలో తెలంగాణ ప్రజల నాడిని తెలుసుకునేందుకు ఆయన సీక్రెట్ సర్వే నిర్వహిస్తున్నారనే టాక్ కాంగ్రెస్ వర్గాల్లో విన్పిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజలు ఏం ఆశిస్తున్నారు? టీఆర్ఎస్ సర్కారుపై ప్రజల్లో ఏమేరకు వ్యతిరేకత వచ్చింది? దేశం, రాష్ట్రంలో నెలకొన్న సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు? కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కార్యక్రమాలు చేయాలని ప్రజలు భావిస్తున్నారు? తదితర అంశాలతో రేవంత్ రెడ్డి తెలంగాణలో సర్వే చేయిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రజల నాడికి పట్టుకునేలా ఇతర రాష్ట్రాలకు చెందిన ఓ ఏజెన్సీతో రేవంత్ రెడ్డి సర్వే చేస్తున్నారనే ప్రచారం గాంధీభవన్లో జరుగుతోంది. ఈ సర్వే రిపోర్టు వచ్చాక కాంగ్రెస్ పార్టీ మరింత జోష్ తో కొత్త కార్యక్రమాలను ప్లాన్ చేయనుందని తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీకి తొలి నుంచి బలంగా నిలుస్తున్న కొన్ని వర్గాలను మరింత అక్కున చేర్చుకోవడంతో ఇతర వర్గాలను ఆకర్షించేలా రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే దళిత గిరిజన దండోరా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా ఆయన కార్యకర్తలంతా రెండేళ్లు ఇంటికి సెలవులు ప్రకటించి కాంగ్రెస్ కోసం పని చేయండి అంటూ పిలుపునిస్తున్నారు. రేవంత్ సైతం టీపీసీసీ చీఫ్ గా నియమాకం అయ్యాక ఫుల్ బీజీగా గడుపుతున్నారు.
ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి తాజాగా తెలంగాణలో ఓ సీక్రెట్ సర్వే చేసినట్లు సమాచారం. తద్వారా తెలంగాణ ప్రజల నాడిని తెలుసుకునే ప్రయత్నం చేసినట్టు భోగట్టా. ఈ రిపోర్టులో వచ్చిన నివేదికల ఆధారంగా ఆయన తన వ్యూహాలను మార్చుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ నుంచి ఏం కోరుకుంటున్నారో? అలాంటి కార్యక్రమాలను రూపొందించుకొని ముందుకెళుతారని తెలుస్తోంది. దీంతో ఈ సర్వేపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఆసక్తిని నెలకొంది. మొత్తానికి రేవంత్ నిర్వహిస్తున్న ఈ సీక్రెట్ సర్వే టీకాంగ్రెస్ కు, రేవంత్ రెడ్డికి ఏ మేరకు కలిసి వస్తుందో వేచిచూడాల్సిందే..!