https://oktelugu.com/

Bigg Boss 5 Telugu: రెచ్చిపోయిన శ్వేత.. హమీదాపై దాడి.. మాటల తూటాలు.. ట్రోలింగ్

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హీట్ ఈసారి అన్ని సీజన్ల కంటే కూడా బాగా పెరిగిపోయింది. గడిచిన నాలుగు సీజన్లకు మించి ఈసారి వాడి వేడి హీట్ పెంచుతోంది. కంటెస్టెంట్లలో కోపం కట్టలు తెంచుకుంటోంది. ఎవరూ ‘తగ్గేదే లే’ అన్నట్టుగా వాదులుకుంటున్న వైనం టీవీ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోంది. అదే సమయంలో హౌస్ లో బూతులు, ఆవేశాలు, దాడులకు కూడా దిగుతుండడం చూసి ప్రేక్షకులు విస్తుపోతున్నారు. బిగ్ బాస్ లో నిన్న సోమవారం రాత్రి […]

Written By:
  • NARESH
  • , Updated On : September 14, 2021 / 10:08 AM IST
    Follow us on

    Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హీట్ ఈసారి అన్ని సీజన్ల కంటే కూడా బాగా పెరిగిపోయింది. గడిచిన నాలుగు సీజన్లకు మించి ఈసారి వాడి వేడి హీట్ పెంచుతోంది. కంటెస్టెంట్లలో కోపం కట్టలు తెంచుకుంటోంది. ఎవరూ ‘తగ్గేదే లే’ అన్నట్టుగా వాదులుకుంటున్న వైనం టీవీ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోంది. అదే సమయంలో హౌస్ లో బూతులు, ఆవేశాలు, దాడులకు కూడా దిగుతుండడం చూసి ప్రేక్షకులు విస్తుపోతున్నారు.

    బిగ్ బాస్ లో నిన్న సోమవారం రాత్రి నామినేషన్ ప్రక్రియ రచ్చ రంబోలా అయ్యింది. ముఖ్యంగా సీనియర్ టీవీ నటి ఉమ ‘బూతు’ పదాలతో రెచ్చిపోవడంతో కంటెస్టెంట్లు షాక్ అయ్యి చెవులు మూసుకున్న పరిస్థితి నెలకొంది. ఇంకొందరు నవ్వు ఆపుకోలేక కిందపడి నవ్వారు.

    ఉమ ఎపిసోడ్ ముగిశాక ఇన్నాళ్లుగా హౌస్ లో సైలెంట్ గా ఉంటున్న ‘సెట్ బ్యూటీ’ శ్వేత రెచ్చిపోయింది. అర్జున్ రెడ్డిలా కంటెస్టెంట్లకు మానవత్వం లేదంటూ మొదట లెక్చర్ ఇచ్చింది. లోబోను ఫ్రెండ్ షిప్ కటీఫ్ చేసింది. అనీ మాస్టర్ ను టార్గెట్ చేయడంపై అందరికీ చెడామడా ఇచ్చేసింది. కోపంతో ఊగిపోతూ హౌస్ లో రచ్చ చేసింది.

    ఈ క్రమంలోనే నామినేషన్ సందర్భంగా రంగుతో ‘హమీద’ ముఖంమీద గట్టిగా కొడుతూ దాడి చేసినంత పని చేసింది. ఇక లోబోపై కూడా ఇదే పని చేసింది. శ్వేత వీరావేశంతో ఊగిపోవడంపై కంటెస్టెంట్లు అంతా తప్పు పట్టారు. దీంతో చివరకు మోకాళ్లపై కూర్చొని అందరికీ సారీ చెప్పింది. కానీ శ్వేత సూక్తులు చెప్పి చివరకు హమీద, లోబోపై కలర్ తో దాడి చేయడం.. వారి కంట్లోకి రంగు పోవడం చూసి నెటిజన్లు మండిపడుతున్నారు. బుద్దులు చెప్పి ఇలా చేయడం ఏంటని శ్వేతను ట్రోల్ చేస్తున్నారు.

    మొత్తంగా నిన్న జరిగిన ఎపిసోడ్ బిగ్ బాస్ లోనే హైలెట్ అని చెప్పొచ్చు. ఇంతటి ఆవేశాలు చూసి అందరూ విస్తుపోతున్న పరిస్థితి నెలకొంది.

    వీడియో