Congress War: అయితే రేవంత్ రెడ్డి.. లేదంటే జగ్గారెడ్డి?

Congress War: కాంగ్రెస్ లో వర్గపోరు ఇంకా తొలగిపోలేదు. దీంతో పార్టీ ఎదుగుదల కనిపించడం లేదు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించాక ఇక పార్టీ పరుగులు పెడుతుందని అందరు భావించినా అది కనిపించడం లేదు. దీంతో పార్టీ భవితవ్యం అగాధంలో పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మధ్య విభేదాలు పొడచూపాయి. దీంతో జగ్గారెడ్డి రేవంత్ పై వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తున్నారు. దీంతో పార్టీ భవితవ్యం మరోసారి అడ్డం తిరిగినట్లు […]

Written By: Srinivas, Updated On : December 28, 2021 10:53 am
Follow us on

Congress War: కాంగ్రెస్ లో వర్గపోరు ఇంకా తొలగిపోలేదు. దీంతో పార్టీ ఎదుగుదల కనిపించడం లేదు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించాక ఇక పార్టీ పరుగులు పెడుతుందని అందరు భావించినా అది కనిపించడం లేదు. దీంతో పార్టీ భవితవ్యం అగాధంలో పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మధ్య విభేదాలు పొడచూపాయి. దీంతో జగ్గారెడ్డి రేవంత్ పై వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తున్నారు. దీంతో పార్టీ భవితవ్యం మరోసారి అడ్డం తిరిగినట్లు చెబుతున్నారు.

Revanth Reddy vs Jagga Reddy

గతంలోనే టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికలో సీనియర్లు చాలా మంది బహిరంగంగానే విమర్శలు చేశారు. పార్టీని నమ్ముకున్న వారికి కాకుండా నడుమ వచ్చిన వారికి కట్టబెట్టడమేమిటనే ప్రశ్నలు వచ్చాయి. దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీహెచ్, జగ్గారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీవన్ రెడ్డి తదితర సీనియర్ నేతలందరు కూడా రేవంత్ రెడ్డి నియామకాన్ని ప్రశ్నించారు

Also Read: వరి విషయంలో కేసీఆరే టార్గెట్.. రేవంత్ ప్లాన్ సక్సెస్..!

ఫలితంగా పార్టీ వ్యవహారాలు ఆశించినంత మేర విజయవంతం కాలేదు. దీంతో పార్టీ వెనకబడిపోయింది. ఈ క్రమంలో బీజేపీ పుంజుకుంది. కాంగ్రెస్ గురించి ప్రజలు మరిచిపోతున్నారు. ఎలాగైనా పార్టీని బలోపేతం చేయాలని భావించే క్రమంలో కేసీఆర్ ఫాం హౌస్ ఉన్న ఎర్రవెల్లిని రేవంత్ రెడ్డి టార్గెట్ చేసుకున్నారు. అక్కడ రచ్చబండ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ జగ్గారెడ్డికి సమాచారం లేకపోవడంతో ఆయన విమర్శలు చేస్తున్నారు. మెదక్ ఎమ్మెల్యేనైన తనకే సమాచారం ఇవ్వకపోవడమేమిటని ఆందోళన చెందుతున్నారు.

ఎర్రవెల్లిలో జరిగే కార్యక్రమానికి తాను హాజరు కాబోనని తెగేసి చెబుతున్నారు. తనకు తెలియకుండా ప్రోగ్రామ్ ప్రకటించడంలో ఆంతర్యమిటని ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి వ్యవహారంతో సీనియర్లు మరోమారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రేవంత్ రెడ్డిపై సీనియర్ల అలకతో ఎర్రవెల్లి రచ్చబండ కార్యక్రమం సజావుగా సాగేనా అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. ఇప్పటికే అధిష్టానం కూడా రేవంత్ తీరుపై పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినా ఆయనలో మాత్రం మార్పు కనిపించడం లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎలా గట్టెక్కుతుందోననే సంశయాలు వస్తున్నాయి.

Also Read: ప్రణాళిక లేకుండానే రేవంత్ రెడ్డి పోరాటం.. ‘కేసీఆర్ ఫాంహౌస్ లో రచ్చబండ’ ఫ్లాప్?

Tags