https://oktelugu.com/

Akhanda 25 Days Collections: అఖండ 25 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ !

Akhanda 25 Days Collections: అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ అంచనాలతో వచ్చిన ‘అఖండ’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సునామీ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా రిలీజ్ అయి నాలుగు వారాలు అవుతున్నా ఇప్పటికీ కలెక్షన్స్ విషయంలో అఖండ ఏ మాత్రం తగ్గడం లేదు. నిజానికి కరోనా సెకెండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ లో ఊపు కనిపించలేదు. దాంతో తెలుగు సినిమాకి కరోనా అనంతరం సాలిడ్ హిట్ పడలేదు. బాలయ్య అఖండతో ఇప్పుడు ఆ లోటు తీరిపోయింది. […]

Written By:
  • Shiva
  • , Updated On : December 28, 2021 / 10:53 AM IST
    Follow us on

    Akhanda 25 Days Collections: అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ అంచనాలతో వచ్చిన ‘అఖండ’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సునామీ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా రిలీజ్ అయి నాలుగు వారాలు అవుతున్నా ఇప్పటికీ కలెక్షన్స్ విషయంలో అఖండ ఏ మాత్రం తగ్గడం లేదు. నిజానికి కరోనా సెకెండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ లో ఊపు కనిపించలేదు. దాంతో తెలుగు సినిమాకి కరోనా అనంతరం సాలిడ్ హిట్ పడలేదు. బాలయ్య అఖండతో ఇప్పుడు ఆ లోటు తీరిపోయింది.

    Akhanda 25 Days Collections

    ఏది అయితే ఏం.. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే బోణీ పడింది. ఈ చిత్రం 25 రోజుల కలెక్షన్స్ ను ఏరియాల వారీగా చూస్తే..

    నైజాం 19.49 కోట్లు
    సీడెడ్ 14.79 కోట్లు
    గుంటూరు 4.63 కోట్లు
    కృష్ణా 3.52 కోట్లు
    నెల్లూరు 2.56 కోట్లు
    ఉత్తరాంధ్ర 6.06 కోట్లు
    ఈస్ట్ 4.06 కోట్లు
    వెస్ట్ 3.75 కోట్లు

    Also Read: Pushpa Collections: ‘పుష్ప’ 5 రోజుల బాక్సాఫీస్ ఫుల్ కలెక్షన్స్ ఇవే !

    ఇక ఏపీ మరియు తెలంగాణ మొత్తం కలుపుకుని చూస్తే : 58.86 కోట్లు

    రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 10.11 కోట్లు

    ఓవరాల్ గా మొత్తం వరల్డ్ వైడ్ గా 68.97 కోట్లును ఈ చిత్రం రాబట్టింది.

    ‘అఖండ’ చిత్రానికి రూ.53.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.57 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. అయితే, అఖండ పై మాత్రం జనం బాగా ఆసక్తిగా ఉన్నారు. అఖండ నుంచే థియేటర్స్ దగ్గర జనం బారులు తీరారు. అసలు.. ఇన్నాళ్లు ఒక్కటంటే ఒక్క సినిమా కూడా సూపర్ హిట్ రేంజ్ కు రాలేదు అని బాధ పడ్డ సినీ అభిమానులు.. ప్రముఖులు అఖండతో ఉత్సవాలు జరుపుకున్నారు.

    బాలయ్య తన మార్క్ యాక్షన్ తో బాక్సాఫీస్ ను కిచిడీ కిచిడీ చేసి పారేశాడు. మొత్తానికి బాలయ్య అఘోర లుక్ కూడా ప్రేక్షకుల మన్ననలు పొందింది. దాంతో సినిమా బాగుంటుందనే పాజిటివిటీ మధ్యన అఖండ రావడం.. అఖండమైన విజయం సాధించడం శుభపరిణామం.
    మొత్తానికి అఖండ ఇచ్చిన అఖండమైన విజయంతో బాలయ్య తన మిగిలిన సినిమాల విషయంలో కూడా వేగం పెంచాడు.

    Also Read: Unstoppable: సుకుమార్​- బాలయ్య కాంబోలో సినిమా?.. పుష్ప టీమ్​తో ‘అన్​స్టాపబుల్’​ సందడి

    Tags