https://oktelugu.com/

Revanth Reddy: కాంగ్రెస్ జవసత్వాలు నింపేందుకే రేవంత్ రెడీ?

Revanth Reddy: కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన ప్రారంభించింది. నేతలను ఆ దిశగా నడిపించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. దేశంలో పార్టీని బలోపేతం చేసే దిశగా ఆలోచనలు చేస్తోంది. ఇందుకు గాను సభ్యత్వ నమోదుపై దృష్టి సారించింది. పైలెట్ ప్రాజెక్టుగా తెలంగాణను తీసుకుంది. ఇందులో భాగంగా ప్రతి పోలింగ్ బూత్ లో వంద మందికి సభ్యత్వం నమోదు ఇప్పించి పార్టీకి కార్యకర్తలను పెంచాలని చూస్తోంది. ఇందులో భాగంగా పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తోంది. రేవంత్ రెడ్డి అధ్యక్షుడిగా […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 18, 2021 7:23 pm
    Follow us on

    Revanth Reddy: కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన ప్రారంభించింది. నేతలను ఆ దిశగా నడిపించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. దేశంలో పార్టీని బలోపేతం చేసే దిశగా ఆలోచనలు చేస్తోంది. ఇందుకు గాను సభ్యత్వ నమోదుపై దృష్టి సారించింది. పైలెట్ ప్రాజెక్టుగా తెలంగాణను తీసుకుంది. ఇందులో భాగంగా ప్రతి పోలింగ్ బూత్ లో వంద మందికి సభ్యత్వం నమోదు ఇప్పించి పార్టీకి కార్యకర్తలను పెంచాలని చూస్తోంది. ఇందులో భాగంగా పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తోంది.

    Revanth Reddy

    Revanth Reddy

    రేవంత్ రెడ్డి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక పార్టీని గాడిలో పెట్టే పనిలో పడిపోయారు. నేతల్లో జోష్ నింపుతూ కార్యక్రమాలు చేపడుతున్నారు. దీని కోసమే గతంలో పలు సభలు నిర్వహించి కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపారు. దీంతో రాష్ర్టంలో కాంగ్రెస్ పరిస్థితి తీరు మారుతోంది. అధికారం కోసం పార్టీని సిధ్ధం చేసేందుకు అన్ని దారులు వెతుకుతున్నారు. దీని కోసమే పలు కార్యక్రమాలు చేపడుతున్నారు.

    ప్రస్తుతం సభ్యత్వ నమోదును విజయవంతం చేసేందుకు పావులు కదుపుతున్నారు. డిసెంబర్ 9 సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా పార్టీ సభ్యత్వ నమోదుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను గుర్తించి వారిని అభినందించే పనిలో పడ్డారు. దీనికి గాను ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ లో సభ్యత్వ నమోదుకు కృషి చేసిన కార్యకర్తకు ఫోన్ చేసి అభినందించి అతడిలో కొత్త జోష్ ను నింపారు.

    Also Read: KCR vs BJP: కేసీఆర్.. బీజేపీని ఓడించగలడా?

    పార్టీలో బేషజాలను పక్కనపెట్టి విజయం కోసం అహర్నిశలు శ్రమించే వారి కోసమే ఎదురు చూస్తున్నారు. సమష్టిగా పనిచేసి అధికారానికి బాటలు వేయాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇన్నాళ్లు పార్టీని వీడి వెళ్లిన వారిని తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. డీఎస్ లాంటి సీనియర్లను పార్టీలోకి తిరిగి రావాలని కోరుతున్నారు. వారికోసం ఎర్రతివాచీలు పరుస్తున్నారు. దీంతో పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

    Also Read: Inter board: ఇంటర్ బోర్డు నిర్వాకం.. విద్యార్థులకు శాపం.. తగ్గిన ఉత్తీర్ణత శాతం

    Tags