Kajal: ఆ విషయంలో ‘సమంత’ను ఫాలో అవుతున్న కాజల్ !

Kajal: మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలను అంగీకరిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ రాసిన కథతో, ‘నేను లోకల్’ ఫేమ్ నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేశారు. ఆ సాంగ్ లో కాజల్ అగర్వాల్ నటించబోతుంది. మొత్తానికి స్పెషల్ సాంగ్ […]

Written By: Shiva, Updated On : December 18, 2021 7:23 pm
Follow us on

Kajal: మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలను అంగీకరిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ రాసిన కథతో, ‘నేను లోకల్’ ఫేమ్ నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేశారు. ఆ సాంగ్ లో కాజల్ అగర్వాల్ నటించబోతుంది. మొత్తానికి స్పెషల్ సాంగ్ చేయడంలో కాజల్, సమంతనే ఫాలో అవుతుంది.

Kajal

వచ్చే వారం నుంచి ఆ సాంగ్ షూటింగ్ సెట్స్‌ పైకి వెళ్లబోతుంది. అన్నట్టు రవితేజ కెరీర్ లో ఇది 69వ చిత్రంగా రాబోతుంది. ఇక ఈ సినిమా కంటెంట్ విషయానికి వస్తే.. ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉండబోతుందట. ముఖ్యంగా సినిమాలో రవితేజ క్యారెక్టరైజేషన్ ఫుల్ కామెడీ టైమింగ్ తో అద్భుతంగా ఉంటుందని చిత్రబృందం నుంచి టాక్ వినిపిస్తోంది.

అయితే, మెగాస్టార్ చిరంజీవి ‘చంటబ్బాయి’ సినిమాకి ఈ సినిమా సీక్వెల్ గా ఉండబోతుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. మరి ఆ సినిమాకి ఈ సినిమా నిజంగానే సీక్వెలా ? లేదా ? అనేది చూడాలి. ఎలాగూ ఈ సినిమా దర్శకుడు త్రినాథరావ్ నక్కిన కూడా మంచి కామెడీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి.. ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.

గతంలో నక్కిన తీసిన చిత్రాలు ‘సినిమా చూపిస్తా మామ’ ‘నేను లోకల్’ సినిమాల శైలిలోనే రవితేజ సినిమా కూడా ఫుల్ కామెడీగా సాగుతుందట. పైగా రవితేజ కామెడీ టైమింగ్ కి తగ్గట్టు ఈ సినిమా ఉండనుంది. ఏమైనా కేవలం తన మాడ్యులేషన్ తోనే రవితేజ అద్భుతమైన కామెడీని పండించగలడు.

Also Read: Shyam Singha Roy: శ్యామ్ ​సింగరాయ్ ​సెన్సార్​ టాక్​ ఎలా ఉందంటే?

కాగా పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ బ్యానర్ల పై టీజీ విశ్వ ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వివేక్‌ కూబిబొట్ట సహా నిర్మాతగా వ్యవహరించనున్నారు. కార్తిక్‌ ఘట్టమనేని సంగీతం అందించనున్నారు. ఇప్పటికే రవితేజ, రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’, మరో వైపు డైరెక్టర్‌ శరత్ మందవాతో ‘రామారావు ఆన్ డ్యూటీ’అనే చిత్రాలు చేసిన సంగతి తెలిసిందే.

Also Read: Pawan Kalyan: ఇప్పటికీ ఎప్పటికీ నెంబర్ వన్ పవన్ కళ్యాణే

Tags