spot_img
Homeజాతీయ వార్తలుRevanth Reddy- KCR: బీఆర్‌ఎస్‌ పేరు మార్పుపై హైకోర్టుకెక్కి కేసీఆర్‌కు షాకిచ్చిన రేవంత్‌ రెడ్డి!

Revanth Reddy- KCR: బీఆర్‌ఎస్‌ పేరు మార్పుపై హైకోర్టుకెక్కి కేసీఆర్‌కు షాకిచ్చిన రేవంత్‌ రెడ్డి!

Revanth Reddy- KCR: తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఆవిర్భవించి.. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి.. ఎనిమిదేళ్లు తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీని.. ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు బీఆర్‌ఎస్‌గా మార్చారు. జాతీయ రాజకీయాల కోసం పార్టీ పేరులో మార్పు చేశారు. ఈమేరకు ఎన్నికల సంఘం కూడా ఆమోదం తెలిపింది. ఈనెల 9న బీఆర్‌ఎస్‌ ఆవిరాభవ వేడుక కూడూ నిర్వహించారు కేసీఆర్‌. అయితే టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా పేరు మార్చడంపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు. ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ ఇవ్వడంపై రేవంత్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో టీఆర్‌ఎస్‌ బంగారు కూలీ పేరుతో నిధులు సమకూర్చుకున్న అంశంపై ఈసీ రేవంత్‌ ఫిర్యాదు చేశారు.

Revanth Reddy- KCR
Revanth Reddy- KCR

ఎన్నికల కమిషన్‌ లేఖ
టీఆర్‌ఎస్‌ సమకూర్చుకున్న నిధులపై విచారణ జరపాలని అప్పుడే అప్పుడే ఆదాయపు పన్ను శాఖకు ఎన్నికల కమిషన్‌ లేఖ పంపింది. ఈ విషయంపై విచారణ చేయకముందే పేరు మార్పుపై రేవంత్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఢిల్లీ హైకోర్టులో అదనపు పిటిషన్‌ దాఖలు చేశారు. రేవంత్‌ రెడ్డి పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు సోమవారం విచారణ జరపనుంది.

డిసెంబర్‌ 8న అనుమతి..
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పేరును భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)గా మార్చుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం డిసెంబర్‌ 8న గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కాగా టీఆర్‌ఎస్‌ పేరును బీఆర్‌ఎస్‌గా మారుస్తూ అక్టోబర్‌ 5న పార్టీ సంయుక్త సమావేశంలో తీర్మానం చేశారు. ఈ తీర్మానంతో పాటు సీఈసీకి కేసీఆర్‌ రాసిన లేఖను ప్లానింగ్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌ బి. వినోద్‌ కుమార్, పార్టీ జనరల్‌ సెక్రటరీ ఎం. శ్రీనివాస్‌ రెడ్డి అందజేశారు.

Revanth Reddy- KCR:
Revanth Reddy- KCR:

ఢిల్లీలో కేంద్ర కార్యాలయం..
టీఆర్‌ఎస్‌ పార్టీ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చడంపై ఎవరికైనా అభ్యంతరాలుంటే చెప్పాలంటూ నవంబర్‌ 7న పబ్లిక్‌ నోటీస్‌ జారీ అయింది. ఆ గడువు డిసెంబర్‌ 7తో ముగిసింది. దీంతో పార్టీ పేరు మార్పుకు సీఈసీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. డిసెంబర్‌ 14న ఢిల్లీలో తెలంగాణ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. ఢిల్లీలో పార్టీ జాతీయ స్థాయి తాత్కాలిక ఆఫీసును ప్రారంభించారు. సర్దార్‌ పటేల్‌ మార్గంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక బీఆర్‌ఎస్‌ ఆఫీస్‌ని పండితులు, ఇతర పార్టీల నేతల సమక్షంలో ప్రారంభించారు. ఆ తర్వాత పార్టీ జెండాను ఎగరేశారు. కార్యక్రమానికి యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్సీ కవిత, కేసీఆర్‌ సతీమణి శోభమ్మ, పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...
Oktelugu Epaper
Exit mobile version