FIFA World Cup Final 2022: మెస్సి కల నెరవేరింది.. 36 సంవత్సరాల తర్వాత అర్జెంటీనా జట్టు సాకర్ కప్ గెలుచుకుంది. ఫ్రాన్స్ జట్టును వరుసగా రెండోసారి కప్ సాధించకుండా చేసింది. పైనల్ మ్యాచ్ లో మెస్సీ మెరిశాడు..ఫ్రాన్స్ పై మెరుపు దాడి చేశాడు. ఫ్రాన్స్ జట్టు ఏం తక్కువ తినలేదు. ఒకరు తక్కువ కాదు. ఒకరు ఎక్కువ కాదు అనే తీరుగా సాగిన ఈ మ్యాచ్లో క్షణక్షణం ఉత్కంఠ కలిగింది. అభిమానులను ముని వేళ్ళ మీద నిలబెట్టింది. ఇంతకీ ఈ సాకర్ ప్రపంచ కప్ ఫైనల్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం పదండి.

*ఒక టోర్నీలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్లకు ఇచ్చే గోల్డెన్ బూట్ అవార్డును ఈసారి ఫ్రాన్స్ హీరో ఎంబప్పే దక్కించుకున్నాడు.. ఫైనల్ మ్యాచ్ కు ముందు అర్జెంటీనా స్టార్ మెస్సి, ఫ్రాన్స్ ఆటగాడు ఎంబప్పే చెరో ఐదు గోల్స్ తో సమంగా నిలిచారు. అయితే తుది పోరు లో మెస్సీ రెండు గోల్స్, ఎంబప్పే మూడు గోల్స్ తో విజృంభించాడు. దీంతో ఎంబప్పే 8 గోల్స్ తో గోల్డెన్ బూట్ దక్కించుకున్నాడు.
*అర్జెంటీనా వరల్డ్ కప్ టైటిల్ నెగ్గడం 36 సంవత్సరాల తర్వాత ఇదే తొలిసారి. చివరిగా 1986లో అర్జెంటీనా విశ్వవిజేతగా నిలిచింది. 2002లో బ్రెజిల్ తర్వాత ఫిఫా వరల్డ్ కప్ గెలిచిన తొలి దక్షిణ అమెరికా జట్టు అర్జెంటీనా. చివరి 4 ఎడిషన్లలో ఐరోపా జట్లే నెగ్గాయి. 2006లో ఇటలీ, 2010లో స్పెయిన్, 2014లో జర్మనీ, 2018లో ఫ్రాన్స్ ఫిఫా కప్ లు సాధించాయి..
*వరల్డ్ కప్ ఫైనల్లో మూడు గోల్స్ చేసిన రెండో ఆటగాడు ఎంబప్పే. ప్రపంచ కప్ లో ఆరంభ మ్యాచ్ ఓడి టైటిల్ నెగ్గిన రెండో జట్టు అర్జెంటీనా.. ఈ టోర్నీలో సౌదీ అరేబియా చేతిలో అర్జెంటీనా ఓడింది. కాగా, 2010లో స్పెయిన్ తమ తొలి మ్యాచ్లో స్విట్జర్లాండ్ చేతిలో పరాజయం పాలైనా టోర్నీ విజేతగా నిలిచింది. వరల్డ్ కప్ ఫైనల్ ను పెనాల్టీ షూట్ అవుట్ లో ఓడిపోవడం ఫ్రాన్స్ కు ఇది రెండోసారి. 2006లో కూడా ఇటలీ చేతిలో ఫ్రాన్స్ ఇలాగే ఓడిపోయింది.

*అర్జెంటీనా జట్టుకు ఇది మూడవ వరల్డ్ కప్.. అంతకుముందు డేనియల్ పసారెల్లా(1978), డిగో మారడోనా (1986) సారధ్యంలో ట్రోఫీ అందుకుంది. వరల్డ్ కప్ ఫైనల్ ను పెనాల్టీ షూట్ అవుట్ ద్వారా నెగ్గిన మూడో జట్టు అర్జెంటీనా.
* మూడు లేదా అంతకంటే ఎక్కువ వరల్డ్ కప్ టైటిళ్ళు నెగ్గిన నాలుగో జట్టు అర్జెంటీనా. అత్యధికంగా బ్రెజిల్ ఐదుసార్లు, జర్మనీ, ఇటలీ నాలుగుసార్లు విజేతగా నిలిచాయి.
*మెస్సికి ఇది 26వ ప్రపంచకప్ మ్యాచ్.. అత్యధిక ప్రపంచ కప్ మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా అతడు రికార్డు సృష్టించాడు.. అంతకు ముందు ఈ రికార్డు మథాస్(25 మ్యాచ్ లు,) పేరిట ఉండేది..
*ఫైనల్లో మూడు గోల్స్ చేసిన మెస్సీ కి ఇది ఓవర్ ఆల్ గా ప్రపంచ కప్ లో అతడికి ఇది 13వ గోల్. ఈ క్రమంలో పీలే సాధించిన 12 గోల్స్ రికార్డును దాటేశాడు. కాకపోతే 16 గోల్స్ తో ఇటలీ ఆటగాడు క్లోజ్, 15 గోల్స్ తో రొనాల్డో మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు.
* పెనాల్టీ షూట్ అవుట్ లో ఫ్రాన్స్ రెండు గోల్స్, అర్జెంటీనా నాలుగు గోల్స్ చేసింది.. ఫ్రాన్స్ జట్టులో ఎంబప్పే, మువానీ గోల్స్ చేశారు. తౌమానీ, కొమాన్ గోల్స్ చేయడంలో విఫలమయ్యారు.
*అర్జెంటీనా జట్టులో మెస్సీ, డిబాల, పరెడ్స్, మోంటియల్ తలా ఒక గోల్ చేసి అర్జెంటీనాను గెలిపించారు
https://www.youtube.com/watch?v=J3jB4CS0x34