https://oktelugu.com/

కొండ పోచమ్మ కథలు.. సిగ్గు.. సిగ్గు అంటున్న రేవంత్

కొండ పొచమ్మ కథలు పేరిట కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టే పనిలో పడ్డారు. ఈమేరకు తన ట్వీటర్లో కొండ పోచమ్మ ప్రాజెక్టు జరిగిన అవినీతి అక్రమాలపై వరుస ట్వీట్లు పెడుతూ ప్రభుత్వాన్ని బెంబెలెత్తిస్తున్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా ప్రారంభించిన కొండ పోచమ్మ సాగర్ ప్రాజెక్టు దుస్థితిపై నిన్న.. నేడు అంటూ ఫొటోలు తీసి ట్వీటర్లో పోస్టు చేశారు. అదేవిధంగా కొండపోచమ్మ అవినీతి పోలీసుల పహారా అంటూ ఓ వీడియోను ట్వీటర్లో పోస్టు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 30, 2020 / 04:23 PM IST
    Follow us on


    కొండ పొచమ్మ కథలు పేరిట కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టే పనిలో పడ్డారు. ఈమేరకు తన ట్వీటర్లో కొండ పోచమ్మ ప్రాజెక్టు జరిగిన అవినీతి అక్రమాలపై వరుస ట్వీట్లు పెడుతూ ప్రభుత్వాన్ని బెంబెలెత్తిస్తున్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా ప్రారంభించిన కొండ పోచమ్మ సాగర్ ప్రాజెక్టు దుస్థితిపై నిన్న.. నేడు అంటూ ఫొటోలు తీసి ట్వీటర్లో పోస్టు చేశారు. అదేవిధంగా కొండపోచమ్మ అవినీతి పోలీసుల పహారా అంటూ ఓ వీడియోను ట్వీటర్లో పోస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది.

    Also Read: కెసిఆర్ లో ఈ మార్పుకి కారణం ఏంటి? ‘మమా’ అనిపిస్తున్నాడు…

    ఇటీవల కురిసిన వర్షాలకు కొండపోచమ్మ ప్రాజెక్టుకు సంబంధించిన చెరువు కట్టలు తెగి గ్రామాల్లోని నీళ్లు వచ్చిన సంగతి తెల్సిందే. దీంతో సీఎం కేసీఆర్ సైతం ఉన్నఫలంగా అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే తాజాగా రిజర్వాయర్ గేట్ల వద్దకు వెళ్లే వంతెను కుప్పకూలింది. దీంతో రేవంత్ రెడ్డి మరోసారి కొండ పోచమ్మ కథల పేరిట అక్కడి దుస్థితిపై వరుస ట్వీట్లు పెడుతున్నాడు.

    Also Read: కేటీఆర్ హడావుడికి కారణం అదేనా?

    ఏపీకి చెందిన ఓ మంత్రి నిర్వాకం వల్లే కొండ పోచమ్మలో ఈ దుస్థితి నెలకొందంటూ ఆరోపణలు గుప్పించాడు. ‘కొండపోచమ్మ కథలు.. కేసీఆర్ స్వహస్తాలతో ప్రారంభించిన కొండపోచమ్మ సాగర్లో అవినీతి ఆనవాళ్లు అనంతం.. నిన్న కట్టలు తెగి నీళ్లు ఊళ్లమీదకు పారితే… తాజాగా రిజర్వాయర్ గేట్ల వద్దకు వెళ్లే వంతెన కుప్పకూలింది.. ఏపీ మంత్రి కంపెనీ నిర్వాకాన్ని పోలీసు పహారాతో కప్పెట్టే కుయత్నం. సిగ్గు…సిగ్గు అంటూ ట్వీట్ చేశాడు. జనాలకు తెలియకుండా కొండపోచమ్మలో పోలీసులను కాపలా పెట్టారని రేవంత్ ఆరోపిస్తూ ఫొటోలను, వీడియోను ట్వీటర్లో పోస్టు చేశాడు. అయితే రేవంత్ చెబుతున్న ఆ ఏపీ మంత్రి ఎవరు అనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.