కేసీఆర్, హరీష్ రావు కన్నీళ్లు.. ఏమైంది?

ఢిల్లీకి రాజైనా ఓ తల్లికి కొడుకే.. అలాగే ఓ స్నేహితుడికి మిత్రుడే.. మంచి స్నేహితుడి జ్ఞాపకాలను మరిచిపోవడం అంత తేలిక కాదు.. చిన్నప్పటి నుంచి మన వెంట నడిచిన మిత్రుడు దూరమైతే.. అతడు పాల్గొనే కార్యక్రమంలో మనం పాల్గొన్న వేళ కన్నీళ్లు ఆపడం ఎవరి తరం కాదు.. ఇదే అనుభవాన్ని తాజాగా హరీష్ రావు అనుభవించాడు. Also Read: కెసిఆర్ లో ఈ మార్పుకి కారణం ఏంటి? ‘మమా’ అనిపిస్తున్నాడు… దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి జ్ఞాపకాలు […]

Written By: NARESH, Updated On : August 30, 2020 3:52 pm
Follow us on


ఢిల్లీకి రాజైనా ఓ తల్లికి కొడుకే.. అలాగే ఓ స్నేహితుడికి మిత్రుడే.. మంచి స్నేహితుడి జ్ఞాపకాలను మరిచిపోవడం అంత తేలిక కాదు.. చిన్నప్పటి నుంచి మన వెంట నడిచిన మిత్రుడు దూరమైతే.. అతడు పాల్గొనే కార్యక్రమంలో మనం పాల్గొన్న వేళ కన్నీళ్లు ఆపడం ఎవరి తరం కాదు.. ఇదే అనుభవాన్ని తాజాగా హరీష్ రావు అనుభవించాడు.

Also Read: కెసిఆర్ లో ఈ మార్పుకి కారణం ఏంటి? ‘మమా’ అనిపిస్తున్నాడు…

దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి జ్ఞాపకాలు సీఎం కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీష్ రావును వెంటాడుతూనే ఉన్నాయి. ఇద్దరికీ కన్నీళ్లు తెప్పించాయి. రామలింగారెడ్డి మృతదేహానికి నివాళులర్పించినప్పుడు కేసీఆర్ కన్నీళ్లు ఆపుకోలేక ఏడ్చేశాడు. ఎందుకంటే ఉద్యమ ప్రస్థానం కంటే ముందు నుంచే సిద్దిపేట, దుబ్బాక ఎమ్మెల్యేలుగా పనిచేసిన కేసీఆర్, సోలిపేట మంచి మిత్రులు.. అన్నా అంటూ కేసీఆర్ ను సోలిపేట పిలిచేవారు. సోలిపేటతో తనకున్న సుధీర్ఘ అనుభవాన్ని కేసీఆర్ గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు.

తాజాగా దుబ్బాక నియోజకవర్గంలో ఓ భారమైన సంఘటన హరీష్ రావుకు ఎదురైంది. దుబ్బాకలో కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల కింద ఆర్థిక సాయం అందించడానికి ఎమ్మెల్యే లేకపోవడంతో మంత్రి హోదాలో హరీష్ రావు దుబ్బాకకు వెళ్లారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు వాటిని అందజేశాడు.

అయితే ఆ కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులపై సోలిపేట రామలింగారెడ్డి సంతకం ఉండడం చూసి హరీష్ రావు షాక్ అయ్యాడు. చనిపోయే ముందు కూడా వాటిని తెప్పించుకొని సోలిపేట రామలింగారెడ్డి సంతకం చేశాడని అధికారులు చెప్పడంతో హరీష్ రావు ఉద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు ఆపుకోలేక ఏడ్చేశాడు.

Also Read: కేటీఆర్ హడావుడికి కారణం అదేనా?

ఈ సందర్భంగా సోలిపేటతో తనకున్న అనుబంధాన్ని హరీష్ రావు గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమకాలం నుంచి తనతో కలిసి తిరిగాడని వాపోయాడు. సోలిపేట కలలను నెరవేర్చడానికి ప్రయత్నిస్తానని చెప్పాడు. సోలిపేట నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను తాను నెరవేరుస్తానని హామీ ఇచ్చాడు.

కాగా సోలిపేట మరణంతో దుబ్బాకలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ తరుఫున సోలిపేట కొడుకునే నిలబెట్టబోతున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. బీజేపీ, కాంగ్రెస్ లు కూడా బరిలో ఉంటామని ప్రకటించాయి.

-నరేశ్ ఎన్నం