https://oktelugu.com/

బాక్సర్ గా మారుతున్న ఈషా రెబ్బా.. పంచ్‌లు ఎవరిపైనో?

ఓరుగల్లు బిడ్డ, అచ్చ తెలుగమ్మాయి ఈషా రెబ్బా. అందం, అభినయం రెండూ ఉన్న తెలుగు నటి. కానీ, అవకాశాలే తక్కువగా వస్తున్నాయి. 2013లో అంతకముందు ఆ తర్వాత మూవీతో హీరోయిన్‌గా పరిచయమైన ఈషా కెరీర్ ఆశించిన వేగంతో ముందుకు సాగలేదు. చిన్నాచితకా సినిమాలకే పరిమితమైందామె. కానీ, రెండేళ్ల నుంచి ఆమె కెరీర్‌‌ మెల్లగా స్పీడందుకుంటోంది. తన ప్రతిభను నిరూపించుకునే కథలు, పాత్రలు ఈషా ముందుకొస్తున్నాయి. తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడలోనూ అవకాశాలు లభిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 30, 2020 / 04:35 PM IST
    Follow us on


    ఓరుగల్లు బిడ్డ, అచ్చ తెలుగమ్మాయి ఈషా రెబ్బా. అందం, అభినయం రెండూ ఉన్న తెలుగు నటి. కానీ, అవకాశాలే తక్కువగా వస్తున్నాయి. 2013లో అంతకముందు ఆ తర్వాత మూవీతో హీరోయిన్‌గా పరిచయమైన ఈషా కెరీర్ ఆశించిన వేగంతో ముందుకు సాగలేదు. చిన్నాచితకా సినిమాలకే పరిమితమైందామె. కానీ, రెండేళ్ల నుంచి ఆమె కెరీర్‌‌ మెల్లగా స్పీడందుకుంటోంది. తన ప్రతిభను నిరూపించుకునే కథలు, పాత్రలు ఈషా ముందుకొస్తున్నాయి. తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడలోనూ అవకాశాలు లభిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు ప్రాజెక్టులున్నాయి. జీవి ప్రకాశ్‌ హీరోగా వస్తున్న ఓ తమిళ మూవీ, కన్నడ హీరో శివరాజ్‌ కపూర్తో ఓ సినిమాకు కమిటైన తెలుగమ్మాయి.. అక్కినేని అఖిల్‌ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్’లో కూడా నటిస్తోంది. అలాగే, ‘లస్ట్‌ స్టోరీస్‌’ వెబ్‌ సిరీస్‌ తెలుగు రీమేక్‌తో ఫుల్‌ బిజీగా మారింది. ఇదిలా ఉండగా.. ఇప్పుడామెకు మరో అవకాశం లభించింది. ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటించే చాన్స్ వచ్చింది. ఓ ప్రముఖ సంస్థ నిర్మించే ఈ చిత్రంలో ఈషా బాక్సర్ గా కనిపించనుంది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించింది.

    Also Read: వెబ్‌ సిరీస్‌లో రేణు దేశాయ్‌ ‘ఆహా’ అనిపిస్తుందా?

    ఈ చిత్రం కోసం బాక్సింగ్‌ నేర్చుకుంటోంది. తొలిసారి ఓ స్పోర్ట్స్‌ డ్రామాకు ఒప్పుకున్న ఆమె.. తనను తాను బాక్సర్ గా మార్చుకుంటోంది. పదునైన పంచ్‌లు విసరడంతో పాటు బాక్సింగ్‌ రింగ్‌లో ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్‌ ఇవ్వాలనే అంశలపై తర్ఫీదు పొందుతోంది. అలాగే, మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌, జిమ్నాస్టిక్స్‌ కూడా నేర్చుకుంటోంది. పాత్ర కోసం తననో క్రీడాకారిణిగా మార్చుకుంటోంది. ‘నేను నా తదుపరి చిత్రంలో బాక్సర్‌గా నటించబోతున్నాను. అందువల్ల శారీరకంగా, మానసికంగా ఆ పాత్రలోకి రావడం నాకు చాలా ముఖ్యం. దానికోసం ట్రైనింగ్ తీసుకుంటున్నా. మార్షల్ ఆర్ట్స్ శిక్షకులతో కూడా శిక్షణ పొందుతున్నాను. తెరపై నిజమైన బాక్సర్ లాగా కనిపించాలనుకుంటున్నా. అందుకోసం జిమ్నాస్టిక్స్ కూడా నేర్చుకుంటున్నా. ఈ చిత్రంలో కొన్ని క్లోజప్ షాట్లు ఉంటాయి. దాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని శిక్షణ తీసుకుంటున్నా. నేను ఈ స్క్రిప్ట్ చదవగానే, ఆ కథే నన్ను ఉత్సాహపరిచింది. మరింత కష్టపడాలని ప్రేరేపించింది. బాక్సింగ్ గ్లౌజులు వేసుకుని పంచ్‌లు విసరాలన్న ఆసక్తి నాకు ఎప్పటి నుంచో ఉంది. ఆ కోరిక ఇప్పుడు నెరవేరనుంది కాబట్టి ఈ మొత్తం ప్రాసెస్‌ను చాలా ఎంజయ్‌ చేస్తున్నా. ఇక, స్నేహితులతో కలిసి ప్రాక్టీస్‌ చేస్తుంటే ఆ ఉత్సాహం రెట్టింపవుతుంది. ప్రస్తుతం నేను శివాత్మిక రాజశేఖర్ ఆమె సోదరి శివానితో కలిసి శిక్షణ తీసుకుంటున్నా. మేమంతా కిక్‌బాక్సింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నప్పుడు చాలా సరదాగా ఉంటుంది’ అని ఈషా చెప్పుకొచ్చింది. అయితే, తన సినిమాకు దర్శకుడు, ప్రొడ్యూసర్ ఎవరనే విషయాలను ఆమె వెల్లడించలేదు. మరి, ఈషా ఎవరితో కలిసి, తెర మీద ఎవరిపై పంచ్‌లు విసురుతుందో తెలియాలంటే కొంత కాలం ఎదురు చూడాల్సిందే.