నేడు ఇంద్రవెల్లిలో టీపీసీసీ సారథ్యం లో దళిత – గిరిజన ఆత్మగౌరవ దండోర బహిరంగ సభలు ప్రారంభంకానున్నాయి .
ఈ దళిత – గిరిజన ఆత్మగౌరవ దండోర బహిరంగ సభను విజయవంతం చెయ్యవలిసింది గా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేసారు. ఈ సభకు రేవంత్ రెడ్డి తోపాటు సిఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ లతో పాటు చైర్మన్ లు, పార్టీ ఎమ్మెల్యే లు, ఎంపీ లు, కార్య నిర్వాహక అధ్యక్షులు, ఏఐసీసీ కార్యదర్శులు ముఖ్య నాయకులు పాల్గొనున్నారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ సభకు హైదరాబాద్ నుంచి భారీ కార్ల ర్యాలీతో వెళ్లనున్నారు. కెసిఆర్ ఏడున్నరెళ్ళ పాలనలో దళిత, గిరిజన వర్గాలకు జరిగిన అన్యాయాలను ఎండగట్టి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికే ఈ సభలు ఏర్పాటు చేసినట్టు రేవంత్ రెడ్డి తెలిపారు
దళిత – గిరిజన ఆత్మగౌరవ దండోర సభలు ఆగస్టు 9 నుంచి సెప్టెంబర్ 17 వరకు కొనసాగనున్నాయి. సెప్టెంబర్ మొదటి వారంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ దళిత – గిరిజన ఆత్మగౌరవ దండోర సభల్లో పాల్గొనున్నారు.