నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ హిందీ నటుడు ‘అనుపమ్ శ్యామ్’ కన్ను మూయడం హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీకే తీరని లోటు. ఆయన వయసు 63 సంవత్సరాలు. గత కొన్నేళ్లుగా అనుపమ్ శ్యామ్ కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. కిడ్నీ సమస్యలకు గత కొంతకాలంగా ఇంట్లోనే డయాలసిస్ చేయించుకుంటున్నారు.
కానీ నాలుగు రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ముంబై సిటీలోని లైఫ్ లైన్ ఆస్పత్రిలో జాయిన్ చేశారు. అయితే, అనుపమ్ శ్యామ్ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి కన్నుముశారు. ఆయన మృతి పై అనుపమ్ స్నేహితుడు యశ్‌పాల్ శర్మ మాట్లాడుతూ.. అనుపమ్ శ్యామ్ లేని లోటు ఎవరు తీర్చలేనిది.
మొదట్లో చికిత్సకి కోలుకుంటున్నట్లు కనిపించినా… నిన్న రాత్రి అనుపమ్ శ్యామ్ ఆరోగ్య పరిస్థితి విషమించి ఈ ఘోరం జరిగింది’ అని తెలిపారు. కాగా అనుపమ్ ‘మన్ కీ ఆవాజ్ ప్రతిజ్ఞ’ వంటి పలు టీవీ సీరియల్స్‌తో పాటు స్లమ్‌డాగ్ మిలియనీర్, బందిపోటు, క్వీన్ వంటి సినిమాల్లోనూ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. ముఖ్యంగా ‘మన్ కీ ఆవాజ్ ప్రతిజ్ఞ’ సీరియల్ లో ఠాకూర్ సజ్జన్ సింగ్ పాత్ర పోషించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు.
హిందీ సినీ ప్రముఖులు అనుపమ్ శ్యామ్ మృతి పట్ల తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. మా ‘ఓకేతెలుగు.కామ్’ తరఫున అనుపమ్ శ్యామ్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నాము