Revanth Reddy vs KTR- Pub Drugs Case: మత్తు పదార్థాల వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలు సత్ఫలితాలు ఇవ్వడం లేదు. దీంతో డ్రగ్స్ దందా మూడుపువ్వులు ఆరు కాయలు అన్న చందంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నడిబొడ్డున పట్టుబడిన వారిలో చాలా మంది మత్తు పదార్థాలు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అందులో సినీ, రాజకీయ, పోలీసు ప్రముఖుల వారసులు ఉన్నట్లు తెలియడంతో ఉలిక్కిపడ్డారు. తరువాత కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. డ్రగ్స్ కేసులో రేవంత్ రెడ్డి మేనల్లుడు ఉన్నాడంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేయడంతో రేవంత్ రెడ్డి స్పందించారు.
చట్టానికి ఎవరు అతీతులు కారని ఎవరు ఉంటే వారిని రిమాండ్ కు పంపించి కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంకా నల్గొండ జిల్లాలో కొడుకును డ్రగ్స్ మాన్పించడానికి ఓ తల్లి కారంపొడి కళ్లల్లో కొట్టినట్లుగా డ్రగ్స్ నిందితులపై చర్యలు తీసుకుంటే తనకు అభ్యంతరం లేదని చెప్పారు. దీంతో ఇరువురి మధ్య రచ్చ కొనసాగుతోంది. గతంలో కూడా కేటీఆర్ పై మత్తు పదార్థాల విషయంలో రేవంత్ రెడ్డి చేసిన విమర్శలతో కోర్టుకు వెళ్లిన కేటీఆర్ ఇప్పుడు ఏం చేస్తారనే దానిపై చర్చ సాగుతోంది.
Also Read: Pawan Kalyan: వైసీపీ మళ్లీ అధికారంలోకి రాదు: పవన్ సంచలన వ్యాఖ్యలు
ఒకరిపై ఒకరు నిందలు వేసుకునే బదులు డ్రగ్స్ దందా నిర్మూలనకు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా దందా మస్తుగా చలామణి అవుతోంది. ఎక్కడ డ్రగ్స్ కేసు పట్టుబడినా దాని మూలాలు మాత్రం తెలంగాణ నుంచి ఉండటం బాధాకరమే. దీనిపై ఉక్కుపాదం మోపాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తున్నట్లు తెలుస్తోంది. పట్టుబడిన వారిని జైల్లో పెట్టకుండా వదిలేయడంతో దందాలో మళ్లీ దిగుతున్నారు. ఇటీవల ఓ విద్యార్థి గంజాయికి బానిసై ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. అయినా ప్రభుత్వానికి పట్టింపులేదు.
ఏదైనా అంటే మేం మత్తు పదార్థాల నిర్మూలనకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. సిబ్బందిని నియమిస్తున్నాం అని చెప్పుకోవడమే తప్ప దానికి సంబంధించిన చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. దీంతో చాపకింద నీరులా డ్రగ్స్ ముఠాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని గంజాయికి బానిసై తరువాత అదే వ్యాపారం చేస్తుందంటే పరిస్థితి తీవ్రత తెలిసిసోతోంది.
ఈ కేసులో ఇప్పటికే పలువురు ప్రముఖుల పేర్లు తొలగించారు. అంటే సామాన్యులపై చర్యలు తీసుకుంటూ పలుకుబడి గల వారిని రక్షించడమే లక్ష్యంగా తెలంగాణ సర్కారు ముందుకు పోతోంది. ఇలాగైతే మత్తు పదార్థాల నివారణ సాధ్యం కాదనే విషయం అర్థమైపోతోంది. ఈ నేపథ్యంలో డ్రగ్స్ నివారణ చర్యలు ఎప్పటికి తీసుకుంటారో తెలియడం లేదు.
Also Read:CM KCR: వైష్ణవం నుంచి.. శైవం వైపు.. కేసీఆర్ ఆధ్యాత్మిక ప్లాన్ ఏంటి?