కరోనా టైంలో రేవంత్ కు ఛాన్స్ దొరికిందా?

తెలంగాణలో కరోనా మహమ్మరి పంజా విసురుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుండటంతో ప్రజలంతా ఆందోళన చెందుతోన్నారు. లాక్డౌన్ సడలింపుల ముందు కరోనాను కట్టడి చేసిన ప్రభుత్వం ఆ తర్వాత చేతులెత్తేసిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతుండటంతో నగరవాసులు భయాందోళనలు చెందుతున్నారు. దీంతో ఇతర ప్రాంతాలకు చెందిన వాళ్లంతా సొంతూళ్లకు పయనమవుతోన్నారు. దీంతో హైదరాబాద్లో నగరంలో ఎక్కడ చూసిన టూలెట్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. ఇలాంటి సమయంలో సీఎం కేసీఆర్ తన […]

Written By: Neelambaram, Updated On : July 9, 2020 1:41 pm
Follow us on


తెలంగాణలో కరోనా మహమ్మరి పంజా విసురుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుండటంతో ప్రజలంతా ఆందోళన చెందుతోన్నారు. లాక్డౌన్ సడలింపుల ముందు కరోనాను కట్టడి చేసిన ప్రభుత్వం ఆ తర్వాత చేతులెత్తేసిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతుండటంతో నగరవాసులు భయాందోళనలు చెందుతున్నారు. దీంతో ఇతర ప్రాంతాలకు చెందిన వాళ్లంతా సొంతూళ్లకు పయనమవుతోన్నారు. దీంతో హైదరాబాద్లో నగరంలో ఎక్కడ చూసిన టూలెట్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. ఇలాంటి సమయంలో సీఎం కేసీఆర్ తన ఫౌంహౌజ్ లో ఉండటంపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి.

కొత్త సచివాలయ నిర్మాణానికి కారణాలు ఇవేనా!

రాష్ట్రంలో కరోనా కేసులు విజృంభిస్తున్న వేళ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లి నుంచి పాలన సాగించడంపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సహా విపక్ష నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరోనా సమయంలో ప్రజలకు భరోసా కల్పించాల్సిన సీఎం కేసీఆర్ ప్రగతిభవన్లో ఉండకుండా ఫౌంహౌజ్ నుంచి పరిపాలన సాగించడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల ప్రగతిభవన్లో 30మందికి కరోనా పాజిటివ్ రావడంతో కరోనా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎం హోదాలో ప్రస్తుతం కేసీఆర్ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని.. ఆయన ఎక్కడ ఉన్నారో చెప్పాలని కోరుతూ తీన్మార్ మల్లన్న హైకోర్టులో మాండమాస్ పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఓ జర్నలిస్టు ఆవేదన.. కన్నీళ్లు పెట్టకమానరు

ఓవైపు సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్ ఎక్కడా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకపోవడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. సీఎం కేసీఆర్ బయట కన్పించకపోవడంతో విపక్షాలకు ఛాన్స్ దొరికినట్లయింది. కరోనా కట్టడిలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే వాదనను ఎంపీ రేవంత్ రెడ్డి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. పనిలో పనిగా సీఎం ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

తొలి నుంచి కేసీఆర్ కు పక్కలో బల్లెంగా మారిన రేవంత్ రెడ్డికి కరోనా అంశం కలిసొచ్చేలా కన్పిస్తుంది. రోజుకురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో సీఎం కేసీఆర్ కు ఈ అంశంపై చుక్కలు చూపించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. కరోనా అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో రేవంత్ సక్సస్ అయితే ఆయనకు తిరుగుండదనే వాదన విన్పిస్తోంది. అయితే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ సీనియర్ నేతలే వెనక్కి లాగుతుండటం గమనార్హం.