ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ కు సీఎంఓలో అందలం!

సీఎంఓలో జరుగుతున్న పరిణామాలు ఐఏఎస్ అధికారుల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అందలం ఎక్కిస్తూ సీనియర్లను పక్కన పెట్టడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం మొత్తం ముఖ్యమంత్రి జగన్ కు తెలియకుండా జరిగే అవకాశం లేదు. ఆయన ఆదేశాల మేరకే ఈ మార్పులు చోటు చేసుకున్నాయనేది వాస్తవం. మాజీ సీఎస్ అజయ్ కల్లం, స్పెషల్ సీఎస్ పి.వి రమేష్ కుమార్ సీఎంఓలో సీనియర్ ఐఏఎస్ అధికారులు. కల్లం కీలక శాఖలు, రమేష్ […]

Written By: Neelambaram, Updated On : July 9, 2020 1:11 pm
Follow us on


సీఎంఓలో జరుగుతున్న పరిణామాలు ఐఏఎస్ అధికారుల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అందలం ఎక్కిస్తూ సీనియర్లను పక్కన పెట్టడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం మొత్తం ముఖ్యమంత్రి జగన్ కు తెలియకుండా జరిగే అవకాశం లేదు. ఆయన ఆదేశాల మేరకే ఈ మార్పులు చోటు చేసుకున్నాయనేది వాస్తవం. మాజీ సీఎస్ అజయ్ కల్లం, స్పెషల్ సీఎస్ పి.వి రమేష్ కుమార్ సీఎంఓలో సీనియర్ ఐఏఎస్ అధికారులు. కల్లం కీలక శాఖలు, రమేష్ కు వైద్య ఆరోగ్య శాఖల పర్యవేక్షణ బాధ్యతలు సీఎం జగన్ ఏడాది కిందట అప్పగించారు.. ఇప్పుడు ఏమైందోగాని ఉన్నట్టుండి వారిని తప్పించారు.

ఓ జర్నలిస్టు ఆవేదన.. కన్నీళ్లు పెట్టకమానరు

ప్రస్తుతం కీలక శాఖల బాద్యతల నుంచి వారిని తప్పించి సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆ శాఖల బాధ్యత అప్పగించి మిగిలిన శాఖలను సీఎం కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్య రాజ్, అదనపు కార్యదర్శి ధనుంజయరెడ్డిలకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ప్రవీణ్ ప్రకాష్ జారీ చేశారు. తనకు తాను ఆదేశాలు జారీ చేసుకోవడం సరైన విధానం కాదని సీనియర్ ఐఏఎస్ అధికారులు వాదనలు. తాజా ఉత్తర్వులతో అజయ్ కల్లం, పివి రమేష్ కుమార్ ల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.

మరోవైపు వివాదాలు, అవినీతి ఆరోపణలు ఉన్న ప్రవీణ్ ప్రకాష్ కు కీలక బాధ్యతలు అప్పగించడంపై ఐఏఎస్ లలో ఆందోళన నెలకొంది. ఐఏఎస్ అధికారిణి రమామణి మృతికి ప్రవీణ్ ప్రకాష్ వేధింపులే కారణమనే విమర్శలు వచ్చాయి. ఆమెకు పోస్టింగ్ ఇవ్వకుండా వేధించారని, ప్రవీణ్ ప్రకాష్ భార్య వినియోగించే వాహనం అద్దె చెల్లించాలని డిమాండ్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని బీజేపీ నేత రఘురాం డీఓపీటీ (డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్) కార్యదర్శికి ఫిర్యాదు చేశారు.

కొత్త సచివాలయ నిర్మాణానికి కారణాలు ఇవేనా!

గతంలో సీఎస్‌గా పనిచేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీలో జరిగిన పరిణామాలపై ఐఏఎస్ అధికారులు అసంతృప్తితో ఉన్నారు. ఎల్వి కంటే జూనియర్ అధికారి ప్రవీణ్, ఎల్విని బదిలీ చేస్తూ ఉత్తర్వులను ఇవ్వడం సరికాదని అప్పట్లో వాదనలు వినిపించాయి. ఆయనను అవమానకరమైన రీతిలో సీఎస్‌ పదవి నుంచి తప్పించారనే చర్చ జరిగింది.

ఇటువంటి పరిస్థితుల్లో.. ప్రవీణ్ ప్రకాష్ కు కీలక శాఖల బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం జగన్ తీస్తుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందోనని, ఈ పరిణామాలకు ఎవరు బలికావాల్సి వస్తుందోనని ప్రశ్నలు ఐఏఎస్ అధికారుల్లో తలెత్తుతున్నాయి.