Revanth Reddy: ఆ సీఎం నినాదాన్ని వాడేస్తున్న రేవంత్‌.. స‌క్సెస్ అవుతుందా…?

Revanth Reddy: రాజ‌కీయాల్లో ప్ర‌తి పార్టీ కూడా కొన్ని నినాదాల‌ను ఇస్తుంది. త‌మ ఉనికిని పెంచుకోవ‌డానికి లేదంటే ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా త‌మ నినాదం వెళ్తే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌స్తామ‌నే త‌ప‌న కూడా ఉంటుంది. ఇలాంటి నినాదాలు ఎన్నిక‌లకు ముందు జ‌గ‌న్ ఎన్నో ఇచ్చాడు. అందులో రావాలి జ‌గ‌న్‌, కావాలి జ‌గ‌న్‌తో పాటు బైబై బాబు కూడా ఒక‌టి. ఇది అప్ప‌ట్లో ఎంత ఫేమ‌స్ అయిందో అంద‌రికీ తెలిసిందే. చివ‌ర‌కు చంద్ర‌బాబుకు అధికారం దూరం అయింది. అయితే ఒక‌రికి […]

Written By: Mallesh, Updated On : February 12, 2022 4:09 pm
Follow us on

Revanth Reddy: రాజ‌కీయాల్లో ప్ర‌తి పార్టీ కూడా కొన్ని నినాదాల‌ను ఇస్తుంది. త‌మ ఉనికిని పెంచుకోవ‌డానికి లేదంటే ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా త‌మ నినాదం వెళ్తే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌స్తామ‌నే త‌ప‌న కూడా ఉంటుంది. ఇలాంటి నినాదాలు ఎన్నిక‌లకు ముందు జ‌గ‌న్ ఎన్నో ఇచ్చాడు. అందులో రావాలి జ‌గ‌న్‌, కావాలి జ‌గ‌న్‌తో పాటు బైబై బాబు కూడా ఒక‌టి. ఇది అప్ప‌ట్లో ఎంత ఫేమ‌స్ అయిందో అంద‌రికీ తెలిసిందే. చివ‌ర‌కు చంద్ర‌బాబుకు అధికారం దూరం అయింది.

Revanth Reddy

అయితే ఒక‌రికి ప‌ని చేసిన నినాదాలు ఇంకొక‌రికి ప‌నిచేస్తాయ‌ని కాదు. అలాగ‌ని చేయ‌వ‌ని కాదు. ఒక చోట స‌క్సెస్ అయిన ఫార్ములాను ఇంకో చోట వాడ‌టం స‌హ‌జ‌మే. అది సినిమాల్లో అయినా, లేదంటే రాజ‌కీయాల్లో అయినా. ఇప్పుడు తెలంగాణ‌లో రేవంత్ రెడ్డి జ‌గ‌న్ ఫార్ములాను వాడేస్తున్నారు. నిన్న జ‌నగామ‌లో కేసీఆర్ ప్ర‌సంగంపై ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు.

Also Read: జీవిత భాగస్వామితో జీవితాంతం సంతోషంగా ఉండాలా.. చెప్పకూడని అబద్ధాలు ఇవే!

తెలంగాణ అస్తిత్వాన్ని ప్ర‌శ్నించిన మోడీ మీద కేసీఆర్ ఎందుకు గ‌ట్టిగా మాట్లాడ‌లేక‌పోతున్నాడ‌ని రేవంత్ రాసుకొచ్చారు. కేసీఆర్‌కు భ‌యం ప‌ట్టుకుంద‌ని, అందుకే సూటిగా అడ‌గ‌లేక‌పోతున్నాడ‌ని మండిప‌డ్డాడు. ఈ సంద‌ర్భంగా బైబై కేసీఆర్ అనే హాశ్ ట్యాగ్‌ను జ‌త చేశారు. అంటే కేసీఆర్‌లో వ‌ణుకు మొద‌లైందని, ఇక ఆయ‌న ఓట‌మి ఖాయం అన్న‌ట్టు రేవంత్ చెబుతున్నార‌న్న‌మాట‌.

Revanth Reddy

అయితే ఆంధ్రాలో వ‌ర్కౌట్ అయిన ఈ నినాదం తెలంగాణ‌లో వ‌ర్కౌట్ అవుతుందా అంటే చెప్ప‌లేం. ఏపీలో జ‌గ‌న్ ఒక్క‌డే ప్ర‌తిప‌క్షంగా ఉన్నారు. కానీ తెలంగాణ‌లో ఇప్పుడు కాంగ్రెస్‌, బీజేపీలు ఉన్నాయి. అంటే త్రిముఖ పోరు. ఒక‌వేళ ఈ నినాదం ప‌నిచేసినా.. అంతిమంగా కాంగ్రెస్‌కు మేలు జ‌రుగుతుందా అంటే చెప్ప‌లేం. ఏదో విధంగా త‌న ఉనికిని చాటుకునే ప‌నిలో ప‌డ్డారు రేవంత్ రెడ్డి. వాస్త‌వానికి ఇలాంటి నినాదాలు ఎన్నిక‌ల స‌మ‌యంలో అయితే బాగా పేలుతాయి. కానీ సంద‌ర్భం లేకుండా వాడినా పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఉండ‌దు క‌దా.

Also Read: తండ్రీ కొడుకుల పోటీ పడ్డా.. హిట్ కొట్టలేకపోయారు !

Tags