Homeజాతీయ వార్తలుRetired IB Officer RN Kulkarni: నిజాలు చెప్పినందుకు మరణం బహుమానం.. ఆ కేంద్ర మాజీ...

Retired IB Officer RN Kulkarni: నిజాలు చెప్పినందుకు మరణం బహుమానం.. ఆ కేంద్ర మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో హత్య వెనుక సంచలన నిజాలు

Retired IB Officer RN Kulkarni: ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ళకు ప్రేరణ. దీనిని ఆయన బలంగా నమ్మారు. కేంద్ర ఇంటలిజెన్స్ విభాగంలో దశాబ్దాల పాటు పనిచేశారు. దేశ సమగ్రత కోసం పాటుపడ్డారు. కానీ బయట శత్రువుల కంటే.. ఇంట్లో శత్రువుల వల్లే దేశానికి ముప్పు ఏర్పడుతున్నదని గ్రహించారు. అందుకే తన పదవి విరమణ అనంతరం నిజాలను పుస్తక రూపంలో చెప్పారు. అవి చాలామంది అసలు రంగులను బయటపెట్టాయి. దీనిని తట్టుకోలేక వారు అతనిపై అక్కసు పెంచుకున్నారు. చివరికి అతనిని అంతమొందించారు.

Retired IB Officer RN Kulkarni
Retired IB Officer RN Kulkarni

ఏం జరిగిందంటే

పదవీ విరమణ చేసిన కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి కులకర్ణి అనే 83 ఏళ్ళ వ్యక్తిని కొందరు కారుతో గుద్ది చంపారు. నవంబర్ 4 సాయంత్రం 5.30 కి నడక కోసం వచ్చిన కులకర్ణి కి యాక్సిడెంట్ అయ్యిందని మైసూరు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఘటన జరిగిన మానస గంగోత్రి అనే ప్రాంతానికి వెళ్ళి చూడగా తీవ్రంగా గాయపడి రోడ్డుకి పక్కగా ఉన్న గడ్డిలో పడి ఉన్న కులకర్ణిని మైసూరు లోని హాస్పిటల్ లో చేర్పించారు. తీవ్ర గాయాలను తట్టుకోలేక ఆయన మరణించినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు!
ముందు పోలీసులతో సహా అందరూ ప్రమాదవశాత్తూ కారు లాంటిది ఏదో గుద్ది వెళ్ళిపోయి ఉంటుంది అనుకోని మొదట హిట్ అండ్ రన్ కేసుగా భావించారు. కానీ ఘటన జరిగిన మైసూరు లోని మానస గంగోత్రి ప్రాంతము లో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ లని పరిశీలించగా అది హత్యగా గుర్తించారు.
సాయంత్రం నడక కోసం వచ్చిన కులకర్ణి అంతగా జన సంచారం లేని మైసూరు యూనివర్సిటీ కాంపస్ లోని మానస గంగోత్రి కాలనీలో హత్యకి గురయ్యారు. నంబర్ ప్లేట్ లేని కారు ఒకటి రోడ్డు పక్కగా నడుచుకుంటూ వెళ్తున్న కులకర్ణి మీదకి కావాలనే వచ్చి గుద్దేశి వెళ్లిపోయినట్లు సీసీ టీవీ లో రికార్డ్ అయ్యింది. దాంతో పోలీసులు హిట్ అండ్ రన్ కేసుగా కాకుండా ప్రీ ప్లాన్డ్ మర్డర్ గా కేసు ఫైల్ చేశారు.
మైసూరు లోని జయలక్ష్మి పోలీసు స్టేషన్ లో ఎఫ్ ఐ ఆర్ లాడ్జ్ చేశారు పోలీసులు. మైసూరు పోలీస్ కమిషనర్ చంద్ర గుప్త మాట్లాడుతూ మొదట హిట్ అండ్ రన్ కేసుగా భావించామని తరువాత సీసీటీవీ ఫుటేజ్ చూశాక దానిని ప్రీ ప్లాన్డ్ మర్డర్ కేసుగా రిజిస్టర్ చేశామని తెలిపారు.
మానస గంగోత్రి నరసింహ రాజ పరిధిలోకి వస్తుంది కాబట్టి అసిస్టంట్ పోలీస్ కమీషనర్ నేతృత్వంలో మూడు టీమ్ లని ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. కారు నంబర్ ప్లేట్ లేకుండా ఉండడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ గా ఉన్నా ఇప్పటికే మా దర్యాప్తు బృందానికి కొన్ని లీడ్స్ దొరికాయని చెప్తూ వాటిని ఇప్పటికిప్పుడే బయటికి చెప్పలేమని మొత్తం కేసు దర్యాప్తు అయిపోయి నిందితులను పట్టుకున్నాక వివరంగా చెప్తామని పేర్కొన్నారు.

ఎవరు హత్య చేసి ఉంటారు

83 ఏళ్ల మాజీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ని ఎవరు హత్య చేసి ఉంటారు ?
కులకర్ణి కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో లో పని చేసి 2000 సంవత్సరంలో పదవీ విరమణ చేశారు.
తన రిటైర్మెంట్ తరువాత కులకర్ణి మూడు పుస్తకాలు వ్రాసారు.
“అండ్ ఎట్ స్మైల్స్”
అనే పుస్తకం రాశారు. ఈ పుస్తకం ఒక కుటుంబంలోని అయిదు తరాల వారి జీవన శైలి తో పాటు అలవాట్లు,పద్ధతులని ఆసక్తికరంగా రాశారు. ఇది ఫిక్షన్ నవల.
“సిన్ ఆఫ్ నేషనల్ కాన్ సైన్స్” అనే రెండో పుస్తకంలో కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో ఆపరేషన్స్ మీద ఆసక్తి కలిగించే విధంగా నిజ అనుభవాలని ఉటంకిస్తూ రాసారు. ఈ పుస్తకం చాలామంది ని ఆకర్షించింది, చర్చలకి తెర తీసింది.
“ఫాసెట్స్ ఆఫ్ టెర్రరిజం ఇన్ ఇండియా” పేరుతో మూడో పుస్తకం రాసారు. ఈ పుస్తకం సంచలన నిజాలను బయట పెట్టింది. భారత దేశంలో ఉగ్రవాదం తాలూకు బహు ముఖాలని బయట పెట్టింది. ముఖ్యంగా జిహాద్ మీద ఆయన రాసిన కొన్ని సంఘటనలు మనల్ని విస్తుపోయేలా చేస్తాయి. ఈ పుస్తకం ప్రధానంగా రెండు విషయాల మీద చర్చిస్తుంది. ఒకటి రెడ్ కారిడార్,రెండోది జిహాద్. ప్రస్తుతం మన దేశం ఈ రెండు విషయాల మీద పోరాడాల్సి వస్తున్నది అంటూ వివరంగా రాసుకొచ్చారు. రెడ్ కారిడార్ అంటే కమ్యూనిస్ట్ ప్రభావం కల మన వ్యవస్థ ఎలా మన దేశాన్ని నడుపుతున్నదీ వివరంగా తెలియచేసారు. రెండోది జిహాద్ ని ఎలా ఎవరు ఎక్కడ ప్రోమోట్ చేస్తున్నారో వివరంగా రాసారు. పైన పేర్కొన్న రెండు పుస్తకాల కంటే ఈ పుస్తకం మరింత ఆసక్తితో పాటు చర్చలకి తెర లేపింది. రాసింది ఒక మాజీ కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్. కాబట్టి కొన్ని నిజ సంఘటనలని రాసారు కాబట్టి ఈ పుస్తకం మీద చర్చ జరిగింది.

Retired IB Officer RN Kulkarni
Retired IB Officer RN Kulkarni

“ఫాసెట్స్ ఆఫ్ టెర్రరిజం ఇన్ ఇండియా”
అనే పుస్తకంల్ 1000 ఏళ్ల దురాక్రమణదారుల నిజ చరిత్రని ప్రస్తావించారు కులకర్ణి. చరిత్ర కారులు మన పూర్వ చరిత్రని ఏ సందర్భంలో ఎలా వక్రీకరించి రాసారో ఆధారాలతో సహా వివరించారు తన పుస్తకంలో.

83 ఏళ్ల కులకర్ణి ని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది ?

జిహాద్ మీద పుస్తకం రాసినందుకా ? లేక ఆస్తుల విషయంలో హత్య జరిగిందా ?
అయితే పోలీసులు ఆస్తి వివాదంలో హత్య జరిగి ఉండవచ్చు అని చూచాయగా చెప్తున్నారు. కానీ అసలు హంతకులను తప్పు దోవ పట్టించడానికి కులకర్ణి హత్య ని ఆస్తి తగాదా హత్యగా ప్రకటించి ఉండవచ్చు. దీని వల్ల హంతకులు నిర్భయంగా ఉంటారు. దొరికిపోతారు అనే వ్యూహం కూడా ఉండి ఉండవచ్చు !
ఏదయినా సరే నిత్యం ప్రశాంతంగా ఉండే మైసూరు లాంటి నగరంలో ఒక మాజీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ హత్య జరగడం విచారకం! పదవీ విరమణ అనంతరం ప్రశాంతంగా ఉండే మైసూరు నగరంలో ప్రశాంతంగా జీవితం గడపాలి అని అనుకునేవారిలో ఉత్తరాది విశ్రాంత ఆఫీసర్లు కూడా ఉన్నారు అంటే ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular