సునీల్ యాదవ్ ఫ్యామిలీ ప్రశ్నలకు జవాబు ఏది?

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో పురోగతి కనిపిస్తోంది సునీల్ కుమార్ యాదవ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అతడి తల్లిదండ్రులు సీబీఐ అధికారులకు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. అమాయకులను అరెస్టు చేస్తూ సీబీఐ గొప్పలు చెప్పుకుంటోందని మండిపడ్డారు. కేసుకు సంబంధంల లేని వారిని అదుపులోకి తీసుకుని సీబీఐ ఏం సాధిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాచ్ మెన్ రంగన్న రెండేళ్ల పాటు ఏం చెప్పకుండా ఇప్పుడు ఎందుకు చెబుతున్నాడని అడుగుతున్నారు. వైఎస్ వివేకాను చంపాల్సిన […]

Written By: Srinivas, Updated On : August 10, 2021 4:31 pm
Follow us on


వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో పురోగతి కనిపిస్తోంది సునీల్ కుమార్ యాదవ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అతడి తల్లిదండ్రులు సీబీఐ అధికారులకు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. అమాయకులను అరెస్టు చేస్తూ సీబీఐ గొప్పలు చెప్పుకుంటోందని మండిపడ్డారు. కేసుకు సంబంధంల లేని వారిని అదుపులోకి తీసుకుని సీబీఐ ఏం సాధిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాచ్ మెన్ రంగన్న రెండేళ్ల పాటు ఏం చెప్పకుండా ఇప్పుడు ఎందుకు చెబుతున్నాడని అడుగుతున్నారు. వైఎస్ వివేకాను చంపాల్సిన అవసరం వేరే వారికి లేదని సూచిస్తున్నారు. వివేకాను చంపిందెవరో సీఎం జగన్ కు తెలుసని వారు తెలియజేస్తున్నారు.

సీబీఐ కావాలనే సామాన్యులపై తన ప్రతాపం చూపిస్తోందని విమర్శిస్తున్నారు. పులివెందులలో వైఎస్ కుటుంబానికి ఎదురే ఉండదు. అలాంటి వ్యక్తిని చంపడం మామూలు విషయం కాదు. ఎవరు హత్య చేసినా ఇట్టే దొరికిపోతారు. మరి అలాంటి కుటుంబానికి ఎదురు నిలబడి సాహసం ఎవరు చేయరని తెలిసినా సీబీఐ అధికారులు కావాలనే కింది వారిని టార్గెట్ చేస్తూ తమ ప్రతాపాన్ని చూపెట్టుకుంటోందని దుయ్యబడుతున్నారు.

వివేకాను హత్య చేయాలంటే వారికంటే పవర్ ఫుల్ వ్యక్తులు అయితేనే వీలుంటుంది. కానీ ఏ నేర చరిత్రలేని వారు ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. దీంతో సీబీఐ అధికారులు అరెస్టు చేసిన సునీల్ యాదవ్ కు ఎలాంటి సబంధం లేదని చెబుతున్నారు. రాజకీయ దురుద్దేశాలతో తమ వాడిని బాధ్యుడిని చేస్తూ చోద్యం చూస్తున్నారని వాపోతున్నారు. ప్రభుత్వం, సీబీఐ అధికారులు నిజానిజాలు చేధించి అసలైన దోషులను పట్టుకోవాలని సూచిస్తున్నారు.

వివేకా హత్య కేసును మొదట నిర్లక్ష్యం చేసి ఇప్పుడు పట్టించుకుని ఎవరని బాధ్యుల్ని చేస్తున్నారో తెలియడం లేదు. నిందితుల్ని పట్టుకోవడంలో సీబీఐ అతిగా ప్రవర్తిస్తోందనే ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. సీబీఐ దర్యాప్తు కోణంలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. చిన్నవారిని టార్గెట్ చేసి పెద్దలను రక్షించే పనిలో ఉందని తెలుస్తోంది. కేసుకు ముగింపు ఇవ్వాలన్న ఆతృతలో అమాయకుల్ని బలి చేయడం ఎ:తవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. సునీల్ యాదవ్ తల్లిదండ్రులు తమ ఆవేదన వెలిబుచ్చుతున్నారు. వారి అనుమానాలకు సీబీఐ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.