ఐపీఎల్ పై కఠిన నిర్ణయం తీసుకున్న బీసీసీఐ

దేశవాళి క్రికెట్ ను ఊపు ఊపేసే ఐపీఎల్ అంటే క్రికెట్ అభిమానులకు పండుగే.. ప్రతి సంవత్సరం ఎంతో జోష్ నింపే ఈ టోర్నీ ఈసారి కరోనా కారణంగా మధ్యలోనే వాయిదా పడింది. పోయిన ఏడాది అయితే యూఏఈలో నిర్వహించాల్సి వచ్చింది. ఈ ఏడాది ఇండియాలో జరిగినా ఆటగాళ్లు కరోనా బారిన పడడంతో టోర్నీ మధ్యలోనే ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక తాజాగా మళ్లీ యూఏఈలోనే మిగిలిన సగం ఐపీఎల్ ను పూర్తి చేసేందుకు బీసీసీఐ నిర్ణయించిన సంగతి […]

Written By: NARESH, Updated On : August 10, 2021 4:25 pm
Follow us on

దేశవాళి క్రికెట్ ను ఊపు ఊపేసే ఐపీఎల్ అంటే క్రికెట్ అభిమానులకు పండుగే.. ప్రతి సంవత్సరం ఎంతో జోష్ నింపే ఈ టోర్నీ ఈసారి కరోనా కారణంగా మధ్యలోనే వాయిదా పడింది. పోయిన ఏడాది అయితే యూఏఈలో నిర్వహించాల్సి వచ్చింది. ఈ ఏడాది ఇండియాలో జరిగినా ఆటగాళ్లు కరోనా బారిన పడడంతో టోర్నీ మధ్యలోనే ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇక తాజాగా మళ్లీ యూఏఈలోనే మిగిలిన సగం ఐపీఎల్ ను పూర్తి చేసేందుకు బీసీసీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు లీగ్ ను విజయంతం చేసేందుకు బీసీసీఐ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఏమాత్రం కరోనా వైరస్ కు అవకాశం ఇవ్వకూడదని.. వైరస్ సంక్రమణ జరగకుండా కఠినంగా బయోబబుల్ నిర్వహించాలని చూస్తోంది. ఈ మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.

ఆటగాళ్లు ఎవ్వరైనా టోర్నీలో సిక్సర్ బాదితే ఆ బంతిని తిరిగి ప్రేక్షకులు బయట వారి నుంచి ఆటగాళ్లకు ఇవ్వకూడదని.. తద్వారా కరోనా సోకకుండా అరికడుతామని బీసీసీఐ తాజాగా నిర్ణయించింది. ప్రస్తుతం బ్యాట్స్ మెన్ సిక్సర్లు కొట్టిన బంతిని తీసుకొని ఎంపైర్లు శానిటైజ్ చేసి బౌలర్లకు ఇస్తున్నారు. అయితే దాని వల్ల కరోనా సోకుతుందని తెలిసింది.. అందుకే ఏకంగా మరో బంతిని ఇవ్వడానికి బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది.

నిజానికి బంతి సిక్స్ గా బయటకు వెళితే కోవిడ్ వచ్చే అవకాశాలు దాదాపుగా లేవని అధ్యయనాలు చెబుతున్నాయి. అయినప్పటికీ బీసీసీఐ ఏమాత్రం రిస్క్ తీసుకోవాలని భావించడం లేదు. అందుకే స్టేడియం బయట సిక్స్ గా వెళ్లిన బంతిని వాడొద్దని.. మరో కొత్త బంతిని ఇవ్వాలని బీసీసీఐ డిసైడ్ అయ్యింది. పాత బంతులను శుభ్రపరిచి దాచాలని నిర్ణయించారు.

ఐపీఎల్ లో సగం మంది ఆస్ట్రేలియన్లు ఆడడానికి రెడీ అయ్యారు. ఆస్ట్రేలియా వివిధ దేశాల్లో మ్యాచులు ఆడుతున్న దృష్ట్యా మొత్తం 20 మంది ఐపీఎల్ ఆటగాళ్లలో సగం మంది మాత్రమే టూర్లకు వెళ్లగా.. మిగిలిన వారు ఐపీఎల్ పార్ట్ 2లో ఆడనున్నారు. ప్రపంచ టీ20 కప్ కూడా యూఏఈలోనే నిర్వహిస్తుండడంతో క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు కూడా తమ ఆటగాళ్లను ఐపీఎల్ కు పంపాలని డిసైడ్ అయ్యిందట.. గ్లెన్ మ్యాక్స్ వెల్, స్వీవ్ స్మిత్, మార్కస్ స్టాయినిస్, క్రిస్ లిన్, నాథన్ కౌల్టర్ నైల్ లాంటి ఆటగాళ్లు ఐపీఎల్ కు అందుబాటులో ఉండనున్నారు.