Jagan: సొమ్మొకడిది సోకొకడిది అంటే ఇదేనేమో. కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ర్ట ప్రభుత్వం సోకులు చేసుకుంటోంది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు అందాయి. కేంద్ర నిధులతో రాష్ర్ట ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని తాఖీదులు పంపింది. జగనన్న పాలు, వైఎస్సార్ సంపూర్ణ పోషణ కోసం రాష్ర్ట ప్రభుత్వం ఖర్చు చేస్తున్న నిధులు కేంద్ర ప్రభుత్వానివేనని తెలియడంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే నిధులు పక్కదారి పట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఏపీ ప్రభుత్వానికి నోటీసులు పంపింది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు చేసిన ఫిర్యాదుతో కేంద్రం రాష్ర్ట ప్రభుత్వ ఖర్చులపై నిఘా పెట్టింది. దీంతో విషయం తెలియడంతో కేంద్రం అందించే నిధులతో తమ సొంత పథకాల డబ్బా కొట్టుకోవడమేమిటని ప్రశ్నించింది. రాష్ర్ట ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలపై ఆరా తీయాలని కోరడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైఎస్సార్ పేరుతో ప్రజల నుంచి మెప్పు పొందాలనే కాంక్షతో జగన్ ఇలా చేస్తున్నారని తేలడంతో లెక్కలు చెప్పాలని కేంద్రం సూచించింది. దీంతో ప్రస్తుతం జగన్ ప్రభుత్వం ఇరుకాటంలో పడింది. నిధులు సరైన రీతిలో ఖర్చు చేయకపోతే చర్యలు తప్పవనే విషయం తెలియడంతో కంగారులో పడిపోయారు.
Also Read: Jagan KCR: జగన్ విధానాలను కాపీ కొడుతున్న కేసీఆర్!
కేంద్ర ప్రభుత్వం అందించే నిధులతో జగన్ రాష్ర్టంలో తమ పథకాలుగా ప్రచారం చేసుకోవడంతో ఇప్పుడు కేంద్రం లెక్కలు చెప్పాలని అడుగుతోంది. దీంతో ప్రభుత్వం డైలమాలో పడుతోంది. రెబల్ ఎంపీ రఘురామకు స్మృతి ఇరానీ కార్యాలయం నుంచి రిప్లయ్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఇటీవల నిధులు ఎలా దారి మళ్లాయో చెప్పాల్సిన అవసరం కూడా రాష్ర్ట ప్రభుత్వానికి రావడంతో చిక్కుల్లో పడినట్లు అవుతోంది.