BJP Politics: టీఆర్ఎస్ వాళ్లు కష్టం.. కాంగ్రెస్ వాళ్లు జాప్యం.. బీజేపీ బలోపేతమెప్పుడు?

BJP Politics: తెలంగాణలో బీజేపీ బలోపేతం కోసం ఏకంగా టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను నియమించారు. చేరికల కమిటీకి చైర్మన్ ను చేసి మరీ ఆయన సారథ్యంలో లాగేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటీవలే ఈటల రాజేందర్ ఢిల్లీ వెళ్లి చేరికలపై రూట్ మ్యాప్ కూడా ఇచ్చాడు. అయినా కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్లడం లేదు. ప్రతిపక్ష కాంగ్రెస్ లోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు సైతం ఆసక్తి చూపడం లేదు. కారణం […]

Written By: NARESH, Updated On : August 3, 2022 10:47 am
Follow us on

BJP Politics: తెలంగాణలో బీజేపీ బలోపేతం కోసం ఏకంగా టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను నియమించారు. చేరికల కమిటీకి చైర్మన్ ను చేసి మరీ ఆయన సారథ్యంలో లాగేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటీవలే ఈటల రాజేందర్ ఢిల్లీ వెళ్లి చేరికలపై రూట్ మ్యాప్ కూడా ఇచ్చాడు. అయినా కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్లడం లేదు. ప్రతిపక్ష కాంగ్రెస్ లోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు సైతం ఆసక్తి చూపడం లేదు. కారణం బీజేపీకి తెలంగాణలో పూర్తిస్థాయిలో బలం లేకపోవడం.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి రాష్ట్రంలో విస్తరించకపోవడంతో ఆ పార్టీని నమ్మి ఎన్నికల్లో దిగడానికి నేతలు తటపటాయిస్తున్నారు.

తెలంగాణ బీజేపీ నేతల మాటలు కోటలు దాటినా పార్టీ బలోపేతం విషయంలో చేతలు మాత్రం తక్కువగా అంటున్నారు. ఒక్క రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ నుంచి లాగడానికి కిందా మీదా పడ్డ పరిస్థితి. దాదాపు 15 రోజులుగా ఆయన బీజేపీలో చేరడానికి తటపటాయించాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక రాజగోపాల్ రెడ్డికి సొంతంగా ప్రతిష్ట లేదు. అన్న చాటు తమ్ముడు. ఇప్పుడు ఒంటరిగా పోటీచేసినా గెలిచే పరిస్థితి ఉండకపోవచ్చని అంటున్నారు. అలాంటి నేతను పెట్టుకొని టీఆర్ఎస్ ను ఓడించాలని కలలుగంటున్న బీజేపీకి అది సాధ్యమవుతుందా? లేదా? అన్నది ఆసక్తి రేపుతోంది.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ కు సుతారం ఇష్టం లేదట.. ఎందుకంటే రెండు సార్లు గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో పీకల్లోతు కోపం ఉంది. అందుకే వారిని వద్దని ఈటల నివేదిక ఇచ్చారట.. కానీ బీజేపీ అధిష్టానం మాత్రం బెంగాల్ ఫార్ములా అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకే గురిపెట్టింది. వారిని బీజేపీలో చేర్చుకొని టీఆర్ఎస్ ను బలహీన పరచాలన్నది కేంద్రం ప్లాన్.

కానీ దీన్ని వ్యతిరేకించి కాంగ్రెస్ నేతలు, బలమైన ద్వితీయ నేతలను చేర్చుకోవాలని ఈటల భావిస్తున్నారు. టీఆర్ఎస్ నేతలను చేర్చుకుంటే వారు బీజేపీలోనూ ఓడిపోవడం ఖాయమంటున్నారు. ఈ క్రమంలోనే గాలం వేస్తున్నా అటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి రావడానికి ఆసక్తి చూపడం లేదు. ఇటు కాంగ్రెస్ నేతలు చేరేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. దీంతో బీజేపీ బలోపేతం ఎప్పుడు? అని అందరూ ప్రశ్నిస్తున్నారు.