Atal Bihari Vajpayee: భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి రాజకీయాల్లో మంచి గుర్తింపు ఉంది. అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్న వాజ్‌పేయి.. మంచి మాటకారి. కవి కూడా. పార్లమెంటులో వాజ్‌పేయి ప్రసంగం వినేందకు చాలా మంది ఆసక్తి చూపేవారు. అమితమైన దేశభక్తి ఉన్న వాజ్‌పేయి.. ఆజన్మ బ్రహ్మచారి. అయితే ఆయన ఒకసారి పాకిస్తాన్‌కు వెళ్లినప్పుడు ఒక మహిళ వాజ్‌పేయి వద్దకు వెళ్లి పెళ్లి ప్రతిపాదన చేస్తూ కశ్మీర్‌ను డిమాండ్ చేసింది. వాజ్‌పేయి కూడా తనదైన శైలిలో సమాధానం ఇచ్చి ఆమెను ముగ్ధురాలును చేశారు. ఈ ఘటనను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఢిల్లీలో కార్యక్రమంలో ప్రస్తావించారు.
వాక్చాతుర్యానికి మహిళ ఫిదా..
ఒకసారి వాజ్‌పేయి ఒకసారి పాకిస్తాన్‌కు వెళ్లినప్పుడు ఆయన ప్రసంగాలకు ఓ మహిళ ఆర్షితురాలైంది. వెంటనే ఆయన వద్దకువచ్చి.. ‘నన్ను పెళ్లి చేసుకుంటారా? అందుకు బదులుగా కశ్మీర్‌ను ఇస్తారా?’ అని అడిగింది. దీనికి వాజ్‌పేయీ స్పందిస్తూ.. ‘నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే.. కానీ, కట్నం కింద పాకిస్థాన్ కావాలి’ అని అడిగారు’’ అంటూ వాజ్‌పేయీ వాక్‌చాతుర్యాన్ని కొనియాడారు. కేంద్ర మంత్రి. వాజ్‌పేయి ప్రత్యర్థులపై విమర్శలు వర్షించినప్పటికీ, ఎప్పుడూ సౌమ్యంగా మాట్లాడేవారు. బీజేపీ విస్తరణ చూసి.. ఆయన ‘కుటుంబం పెద్దదవుతోంది‘ అని ఆనందం చెప్పారని రాజ్‌నాథ్ గుర్తుచేశారు. ఈ లక్షణం ఆయన రాజకీయ వ్యూహానికి మూలం. పార్లమెంటు వేదికల్లో లేదా వెలుపల, ఆయన మాటలు ప్రతిరసుకున్నాయి. ఇది దౌత్య రంగంలో భారత్‌కు బలమైన చిహ్నంగా నిలిచింది.
రాజనీతిజ్ఞుడి జీవిత యాత్ర
వాజ్‌పేయీ కవిత్వం, సాహిత్యంతో ప్రసిద్ధి చెందినవారు. నాలుకపై సరస్వతి నివసించిందని సహచరులు ప్రశంసించారు. వివాహం చేసుకోకపోయిన ఆయన, గ్వాలియర్ కళాశాలలో సహాధ్యాయి కుమార్తె నమితను దత్తత తీసుకున్నారు. ఆమె అంత్యక్రియలు నిర్వహించడం ఆయన వ్యక్తిగత బంధాల లోతును తెలియజేస్తుంది. ఈ లక్షణాలు ఆయనను సామాన్యుడు నుంచి మహానుభావుడిగా మార్చాయి.
వాజ్‌పేయి 101వ జయంతి రోజున ఆయన జీవితం యువ రాజకీతిజ్ఞులకు పాఠాలు నేర్పుతోంది. వాక్కుల శక్తి ద్వారా శత్రువులను స్నేహితులుగా మార్చే వాజ్‌పేయీ శైలి ఈరోజు కూడా ప్రస్తుతం. భాజపా నాయకులు ఆయన వారసత్వాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నారు.