ఏపీపై కేంద్రం ఫోకస్: మత మార్పిడులపై కేంద్రం సీరియస్‌?

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. హిందూ దేవాలయాలపై దాడులు పెరుగుతుండగా.. అన్యమత ప్రచారాలను ప్రోత్సహిస్తున్నారనే అపవాదును ఎదుర్కొంటున్నారు. అంతేకాదు.. రాష్ట్రంలో బడుగు, బలహీనవర్గాల బలహీనతలను ఆసరా చేసుకొని పెద్ద ఎత్తున మత మార్పిడులు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మతం మార్చుకుని రిజర్వేషన్లు అనుభవిస్తూ ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన కొంత మంది వ్యవహారాలను వెలుగులోకి తీసుకు వస్తున్న లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ .. మరోసారి ఈ అంశంపై రాష్ట్రపతికి, కేంద్ర సామాజిక న్యాయశాఖకు […]

Written By: NARESH, Updated On : September 30, 2020 3:05 pm

bjp

Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. హిందూ దేవాలయాలపై దాడులు పెరుగుతుండగా.. అన్యమత ప్రచారాలను ప్రోత్సహిస్తున్నారనే అపవాదును ఎదుర్కొంటున్నారు. అంతేకాదు.. రాష్ట్రంలో బడుగు, బలహీనవర్గాల బలహీనతలను ఆసరా చేసుకొని పెద్ద ఎత్తున మత మార్పిడులు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మతం మార్చుకుని రిజర్వేషన్లు అనుభవిస్తూ ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన కొంత మంది వ్యవహారాలను వెలుగులోకి తీసుకు వస్తున్న లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ .. మరోసారి ఈ అంశంపై రాష్ట్రపతికి, కేంద్ర సామాజిక న్యాయశాఖకు ఫిర్యాదు చేసింది.

Also Read: బుద్ది తక్కువై పవన్ ను నమ్మాం.. పవన్ మూడు పెళ్లిళ్ల మాసికం: నారాయణ

ఏడాది కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మత మార్పిళ్లకు సంబంధించి.. పూర్తి సమాచారాన్ని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ సంపాదించింది. క్రైస్తవ మతమార్పిళ్లు, ఎస్సీ రిజర్వేషన్ల దుర్వినియోగం, తప్పుదోవ పట్టించే జనాభా లెక్కలు మొదలైన అంశాలపై సమగ్ర నివేదికను రాష్ట్రపతి భవన్‌కు, సామాజిక న్యాయశాఖకు పంపించారు. ఈ మత మార్పిడుల వ్యవహారంపై ప్రభుత్వం కూడా తేరుకొని సమగ్ర విచారణ ప్రారంభించాలని అభ్యర్థించింది. అంతేకాదు.. అక్రమ మరమార్పిడులు, రిజర్వేషన్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు స్పందించిన రాష్ట్రపతి కూడా దీనిపై విచారణ జరపాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిని ఆదేశించారు. రాష్ట్రపతి వివరణ కోరినా రాష్ట్రం నుంచి ఎలాంటి సమాచారం పోలేదని తెలుస్తోంది.

లీగల్‌ రైట్స్‌ ప్రొటెక్షన్ ఫోరం సంపాదించిన సమాచారంలో కొన్ని కేస్‌ స్టడీలను సైతం పొందుపరిచింది. కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలంలో ఉన్న గ్రామాల సంఖ్య 11. కానీ ప్రభుత్వ రెవెన్యూ రికార్డుల ప్రకారం ఉన్న చర్చిల సంఖ్య 68. సగటున గ్రామానికి 6 చర్చిలు ఉన్నాయి. ఇదే మండలంలో మద్దిలపర్వ అనే గ్రామం ఉంది. అందులో రికార్డుల ప్రకారం ఒక్కరంటే ఒక్కరు కూడా క్రిస్టియన్ లేరు. కానీ.. ఆ గ్రామంలో పదకొండు చర్చిలు ఉన్నాయి. అంటే.. ఆ చర్చిలను నిర్వహిస్తున్నవారు, ఆ చర్చిలకు వెళ్తున్న వారు తమను తాము క్రైస్తవులుగా నమోదు చేసుకోలేదన్నమాట. ఇది ప్రభుత్వాలను మోసగించడమేనని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అంటోంది.

Also Read: విద్యార్థులకు సీఎం జగన్ శుభవార్త.. అక్టోబర్ 5నే ఆ పథకం అమలు..?

2011 జనాభా లెక్కల ప్రకారం అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6.82 లక్షల క్రైస్తవ జనాభా ఉంది. 1971 నుంచి 2011 కాలంలో రాష్ట్రంలోని క్రైస్తవ జనాభా తగ్గుతూ వచ్చింది. విద్య, ఉద్యోగం, ఉపాధి అంశాల్లో రిజర్వేషన్లు పొందే ఉద్దేశంతో క్రైస్తవంలోకి మారినప్పటికీ అధికారిక రికార్డుల్లో ఆ విషయాన్ని తెలియజేయకుండా దాచిపెడుతూ ప్రభుత్వ యంత్రాంగాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. నిజం తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికే మతం మార్చుకుని రిజర్వేషన్లను ఉపయోగించుకుంటూ పెద్ద ఎత్తున లాభపడుతున్న క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. ఉండవల్లి శ్రీదేవి, మేకతోటి సుచరిత సహా పలువురు ప్రముఖులు మతం మార్చుకున్నారు. రిజర్వేషన్ల ఫలాలు అలానే పొందుతున్నారు. వీరు మతం మార్చుకొని రిజర్వేషన్లు పొందుతుండడంతో అసలైన వారు అన్యాయమైపోతున్నారు. ఈ రిజర్వేషన్లను వీరు వదులుకుంటే మిగితా వారికి లాభం చేకూరుతుంది కదా. వీరికి న్యాయం చేయడానికే లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం కృషి చేస్తోంది. చివరికి ఈ అంశం ఎటుదారితీస్తుందో తెలియకుండా ఉంది.